‘జగన్‌ భవిష్యత్తులో మీరు ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తారు’ | MP Parimal Nathwani Praises YS Jagan Mohan Reddy Over India Today Survey | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన పరిమళ్‌ నత్వాని

Aug 8 2020 5:38 PM | Updated on Aug 8 2020 5:53 PM

MP Parimal Nathwani Praises YS Jagan Mohan Reddy Over India Today Survey - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పరిమళ్‌ నత్వాని సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే పని తీరుతో త్వరలోనే ఆయన ప్రథమస్థానంలో నిలుస్తారని ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం పరిమళ్‌ నత్వాని ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక్క ఏడాదిలోనే సీఎం జగన్‌.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడోస్థానం సంపాదించడం నిజంగా ప్రశంసనీయం. ఏపీ ప్రజల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో విస్తృమైన కృషి చేస్తన్న మీరు.. భవిష్యత్తులో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తారని నాకు తెలుసు’ అంటూ ట్వీట్‌ చేశారు. (ఆ పదవికి రాహులైతేనే బెస్ట్‌)
 

ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement