సీఎం జగన్‌కు ధన్యవాదాలు : పరిమల్‌ | Parimal Nathwani Thank To AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు ధన్యవాదాలు : పరిమల్‌ నత్వాని

Mar 9 2020 6:59 PM | Updated on Mar 9 2020 7:09 PM

Parimal Nathwani Thank To AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ పరిమల్‌ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పెద్దల సభకు నామినేట్‌ చేసిందుకు సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పరిమల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు.  ‘ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేస్తాను’ అని పోస్ట్‌ చేశారు. (వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు)

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో పార్టీ ముఖ్యనేతలో చర్చించిన అనంతరం పరిమల్‌ను పెద్దల సభకు నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement