‘సీఎం జగన్‌ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శం’ | YSRCP MP Parimal Nathwani Praises YS Jagan Government Schemes | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శం’

Jun 25 2020 6:27 PM | Updated on Jun 25 2020 6:36 PM

YSRCP MP Parimal Nathwani Praises YS Jagan Government Schemes - Sakshi

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పరిమళ్‌ నత్వాని ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇంటింటి సర్వే, వలంటీర్‌ వ్యవస్థలతో పాటుగా అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు. జాతీయ మీడియా న్యూస్‌ ఎక్స్‌లో వచ్చిన ఓ కథనాన్ని ఆయన షేర్‌ చేశారు. కరోనాపై పోరులో తొలి నుంచి సీఎం వైఎస్‌ జగన్ చేస్తున్న‌ కృషికి ఇది నిదర్శనమని చెప్పారు.  (చదవండి : అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి)

కరోనాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని పలు రాష్ట్రాలు అనుకరిస్తున్నాయని న్యూస్‌ ఎక్స్‌ ఆ కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిని ఎదురించేందుకు నూతన మార్గాలను అవలంబించడంలో ఏపీ ముందుందని.. ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపింది. కరోనాపై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే, సాంకేతిక పరికరాల వినియోగం, వలంటీర్‌ వ్యవస్థ, డోర్‌ టు డోర్‌ సర్వేలను ప్రధానంగా ఆ కథనంలో ప్రస్తావించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement