‘డూప్‌తో మాట్లాడిస్తున్నారా..?’ | YSRCP MLA Adeep raj Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

విశాఖపై విషం చిమ్ముతున్నారు..

Aug 8 2020 3:13 PM | Updated on Aug 8 2020 3:31 PM

YSRCP MLA Adeep raj Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అమరావతిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ, పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ ‌రాజ్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో జరిగిన అక్రమాలను అసెంబ్లీలో  సాక్ష్యాలతో సహా నిరూపించామని తెలిపారు. విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. ('చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం')

టీడీపీ హయాంలో విశాఖ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదాల్లో 53 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు జరిగిన చిన్న ప్రమాదాలను కూడా రాజకీయం చేసి విశాఖపై విషం చిమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ఉన్నారా.. లేక డూప్‌తో మాట్లాడిస్తున్నారో అర్థం కావడం లేదు. నాలుగు నెలలుగా ఆయన అడ్రస్సే లేరని అదీప్‌ రాజ్‌ ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement