'చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం' | Karanam Dharmasri Fires On Chandrababu About Capital Issue | Sakshi
Sakshi News home page

'చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం'

Aug 8 2020 2:02 PM | Updated on Aug 8 2020 2:08 PM

Karanam Dharmasri Fires On Chandrababu About Capital Issue - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడుకు అభ్యంతరమెందుకని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అభిప్రాయపడ్డారు.  కొత్త రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తవుతుంది. కేవలం 10వేల కోట్ల చొప్పున వెచ్చిస్తే అమరావతి, కర్నూల్‌, విశాఖలో రాజధానుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని విశాఖ రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకిస్తే ఉద్యమాలు తప్పవన్నారు. జూమ్‌ టీవీల్లో మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరన్నారు. చంద్రబాబునాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమన్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే వారి రాజకీయ సమాధి ఖాయమని ధర్మశ్రీ ఎద్దేవా చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement