Sakshi News home page

విశాఖ డ్రగ్స్‌.. చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలి

Published Fri, Mar 22 2024 3:49 PM

Ysrcp Leaders Complained To Chief Electoral Officer On Tdp - Sakshi

టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై సీఈవోకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. సీఈవోతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్‌లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు.

ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్‌ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్‌పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. లోతుగా విచారణ జరపాలని సీఈవోకు ఫిర్యాదు చేశామని.. విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది. 25 వేల కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకుంది. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు. చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు. చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే. చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది. దీనిలో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలని కోరాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.

‘‘గతంలో ఐదేళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు. ఆ సింగపూర్‌ మంత్రి జైల్లో ఉన్నాడు. చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. ఓట్ల కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీని కోరాం. దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. చంద్రబాబు ట్వీట్‌పై కూడా ఫిర్యాదు చేసాం. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం. దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఈనాడు పత్రికపై విషంతో వార్తలు రాశారు. ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం’’ అని పేర్ని నాని తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖ డ్రగ్స్‌.. చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల

Advertisement

What’s your opinion

Advertisement