ఆంధ్ర వర్సిటీలో 200 కోట్ల స్కాం: కొండా రాజీవ్‌ | YSRCP Konda Rajeev Serious Comments on Nara Lokesh | Sakshi
Sakshi News home page

ఆంధ్ర వర్సిటీలో 200 కోట్ల స్కాం: కొండా రాజీవ్‌

Oct 11 2026 1:59 PM | Updated on Oct 11 2026 1:59 PM

YSRCP Konda Rajeev Serious Comments on Nara Lokesh

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీలో నిర్మాణాల అంచనాలు నాలుగు నెలల్లోనే రూ.95 కోట్ల నుంచి రూ.210 కోట్లకు ఎలా పెరిగాయంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్‌ ప్రశ్నించారు. ఏయూలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన రాజీవ్‌.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్‌ తాజాగా మీడియాతో మట్లాడుతూ.. ఏయూలో నూతన భవనాల నిర్మాణాల కోసం తొలుత రూ.95 కోట్లతో అంచనాలు రూపొందించి, నాలుగు నెలల్లోనే వాటిని రూ.210 కోట్లకు పెంచారని పేర్కొన్నారు. యూనివర్సిటీలో సొంత ఇంజినీరింగ్‌ విభాగం ఉండగా.. నిర్మాణ పనులను ఇతరులకు ఎందుకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ప్రశ్నించారు. అంచనాలను ఇంత భారీగా పెంచడం వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని అభివృద్ధి చేశామని కొండ రాజీవ్‌ అన్నారు. ఏయూకు రూ.500 కోట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. యూనివర్సిటీకి చెందిన రూ.300 కోట్ల నిధులను దారి మళ్లించారని విమర్శించారు. ఏయూలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై లోకేశ్‌ స్పందించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఉమాదేవికి చెక్‌ పెట్టే ప్లాన్‌.. డాక్టర్‌ పేరు తెరపైకి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement