విశాఖ విద్య: సౌత్ ఇండియా ఇంటర్ జోనల్ యూనివర్సిటీ పోటీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పురుషుల, మహిళల, వెయిట్ లిఫ్టింగ్ జట్టు సత్తా చాటింది. పురుషులు, మహిళల విభాగంలో ఈ నెల 18 నుంచి 23 వరకు చైన్నెలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆంధ్రా యూనివర్శిటీ మహిళా క్రీడాకారులు మూడు బంగారు పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో ముగ్గురు క్రీడాకారులు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. మహిళా విభాగం లో ఎస్.పల్లవి 69 కిలోల విభాగం, ఎ.రేవతి 86 కిలోలు, టి.లావణ్య 57 కిలోల విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. పురుషుల్లో పోటీలకు అర్హత సాధించిన వారిలో 67 కిలోల విభాగంలో జి.కిరణ్ కుమార్, ఎం.తరుణ్ ఉన్నారు. విజేతలకు ఏయూ వీసీ ఆచార్య జీపీ.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆచార్య పల్లవి అభినందించారు. ఏయూ జట్టుకు మేనేజర్‌గా డాక్టర్ శ్రీనివాసరావు, కోచ్‌గా వెంకటేశ్వరావు వ్యవహరించారు.


