డాబాగార్డెన్స్: మ్యాజిక్ ఆస్వాదిద్దాం.. నిరుపేద పిల్లల విద్యకు మన వంతు సహాయం అందిద్దాం.. పేరిట ఈ నెల 29న గురజాడ కళాక్షేత్రం వేదికగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మెజీషియన్, ఇల్యూషనిస్ట్ బీఎస్ రెడ్డిచే మ్యాజిక్ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఓ హోటల్లో కార్యక్రమ పోస్టర్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెజీషియన్ బీఎస్ రెడ్డి మాట్లాడుతూ వినోదంతో పాటు ఓ మంచి ఆశయం కోసం మ్యాజిక్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వైజాగ్ శాఖ అధ్యక్షుడు ఎ.అరుణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు జీఎన్ రాజు, కార్యదర్శి కామేష్ పాలూరి, కోశాధికారి సంతోషిణి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ బరోడా, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


