ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ | YSR Death Anniversary: Governor Abdul Nazeer Pay Tributes | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌.. ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Sep 2 2023 8:54 AM | Updated on Sep 2 2023 3:56 PM

YSR Death Anniversary: Governor Abdul Nazeer Pay Tributes - Sakshi

రైతులు, పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు..

సాక్షి, కృష్ణా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఘనంగా నివాళి అర్పించారు. ఈ మేరకు శనివారం గవర్నర్‌ కార్యాలయం అధికారిక ఎక్స్‌(ట్విటర్‌) హ్యాండిల్‌ ఆయన సందేశం ఉంచింది.

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికత కలిగిన నాయకుడు. రైతులు, పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన పేరుగాంచారు. అందుకే ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది. 

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన అమలు చేసిన ప్రజా-స్నేహపూర్వక సంక్షేమ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు అని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement