ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత | AP Governor Abdul Nazeer Hospitalized Due To Stomach Pain | Sakshi
Sakshi News home page

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత

Apr 25 2026 8:56 AM | Updated on Apr 25 2026 9:08 AM

AP Governor Abdul Nazeer Hospitalized Due To Stomach Pain

సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. నజీర్‌ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చేర్చించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

వివరాల మేరకు.. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నిన్న(శుక్రవారం) బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉంది. రాత్రి 12 గంటలకు బెంగళూరు నుంచి రావాల్సిన గవర్నర్ విమానం ఆలస్యమైంది. దీంతో, అర్ధరాత్రి రెండు గంటలకు ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు నజీర్‌ కడుపులో నొప్పి బాధపడ్డారు. అనంతరం, గవర్నర్‌ను మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించినట్టు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement