
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. "స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
“స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీగారు. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు.#GandhiJayanti
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025
లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్ జగన్ నివాళి
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన `జై జవాన్..జై కిసాన్` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన ``జై జవాన్..జై కిసాన్`` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025