శ్రీశైలం టెంపుల్: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 12న ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. చండీశ్వరునికి విశేష పూజలు జరిపిస్తారు.
13 నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపిస్తారు. 17న యాగ పూర్ణాహుతి, 18న పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సంక్రాంతి రోజైన 15న జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12నుంచి 18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలుపుదల చేశారు.


