శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న దళిత బాలికపై లైంగికదాడి చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మంగువారితోట కండ్రవీధికి చెందిన బొమ్మలాట నవీన్ (19) నెలరోజులుగా బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ యువకుడిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కేసును జిల్లా పోలీస్ శిక్షణా సంస్థ డీఎస్పీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు.


