ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కో–ఆర్టీనేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్టీనేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ అంశాలపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.


