కర్నూలు: రైతులను కూటమి సర్కార్ మరోసారి మోసం చేసింది. సాగునీరు ఇవ్వలేమంటూ రైతులకు షాకిచ్చింది చంద్రబాబు సర్కారు. తుంగభద్ర, పోతిరెడ్డిపాడు నుంచి తాగడానికి తప్ప వ్యవసాయానికి నీరు ఇవ్వలేమని మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చిచెప్పారు.
2027 జూలై వరకూ సాగునీరు అడగొద్దన్నారు నిమ్మల. నీరు లేక పంటలు ఎండిపోయాయని చెప్తే ఏం చేయలేం? అని రైతులకు స్పష్టం చేశారు. హంద్రీనీవా నీళ్లను తాగునీటికే వాడుకోవాలని మంత్రి నిమ్మల కరాఖండీగా చెప్పేశారు.


