సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత ప్రజా సమస్యలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు.
పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజాపోరాటాలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు.


