కడప జిల్లా: దివంగత మహానేత వైఎస్సార్ సోదరుడు దివంగత వైఎస్ జార్జిరెడ్డి 26వ వర్థంతి ఆదివారం పులివెందులలో ఘనంగా నిర్వహించనున్నారు. పులివెందులలోని వైఎస్సార్ ఫ్యామిలీ సమాధుల తోటలో వైఎస్ జార్జిరెడ్డి ఘాట్ వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు.
భాకరాపురంలో వైఎస్ జార్జిరెడ్డి ఐటీఐలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలు అనాథలకు దుస్తులు పంపిణీ చేయనున్నారు. జీసెస్ చారిటీస్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరపనున్నారు. అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఇందిరా మహిళా మండలికి సంబంధించిన మహిళల కోసం ఏర్పాటు చేసిన టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సుకు సంబంధించిన శిక్షణను ప్రారంభిస్తారు.


