వెలుగులోకి మరో జనసేన నేత మోసం | Woman Allegations On Janasena Leader Bethapudi Vijay Sekhar | Sakshi
Sakshi News home page

వెలుగులోకి మరో జనసేన నేత మోసం

Jun 10 2026 7:17 PM | Updated on Jun 10 2026 7:44 PM

Woman Allegations On Janasena Leader Bethapudi Vijay Sekhar

సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి  బేతపూడి విజయ్‌ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ  మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని  చేశాడని పేర్కొంది. ఆ  మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ  చెబుతోంది.

2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్‌ శేఖర్‌ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్‌శేఖర్‌ దాడి చేశారు.

బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్‌తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా విజయ్‌శేఖర్‌కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు

..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్‌కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్‌ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement