సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో తొలిరోజే ఇంద్రకీలాద్రిపై భక్తులు చుక్కలు చూపిస్తున్నారు. భక్తులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారు. క్యూలైన్లలో కనీసం తాగునీరు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు.. ఎంపీ కేశినేని చిన్నిని నిలదీశారు.
మీడియాపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
ఇదిలా ఉండగా.. దుర్గ గుడి వద్ద మీడియా ప్రతినిధుల ఆందోళనకు దిగారు. మీడియా ప్రతినిధులకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. దసరా ఉత్సవాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఆయన మండిపడ్డారు. దసరా ఉత్సవాల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ దారుణంగా వైఫల్యం చెందిందని వెల్లంపల్లి మండిపడ్డారు.
‘‘తొలిరోజే భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. భక్తులకు క్యూలైన్లలో కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకూడదనే మీడియాపై ఆంక్షలు పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. ఇన్ఫ్లుయెన్సర్లతో డబ్బాలు కొట్టించుకోవడం పై నే చంద్రబాబు, జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం మీడియాపై ఆంక్షలు పెట్టడమేంటి?. ఇదేనా ఉత్సవాల పై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. భక్తులకు, మీడియా ప్రతినిధులకు మేం అండగా ఉంటాం’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బీసీలకు వెన్నుపోటు అడ్డంగా దొరికినా బుకాయింపే


