Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం | TTD News: Tirumala Que Updates On March 24 2024 | Sakshi
Sakshi News home page

సర్వదర్శనానికి 12 గంటల సమయం

Mar 25 2024 7:24 AM | Updated on Mar 25 2024 7:24 AM

TTD News: Tirumala Que Updates On March 24 2024 - Sakshi

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి  12  గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 80,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,438 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement