తిరుపతి: జిల్లాలోనూ పింక్‌ బస్సులు తిప్పుతాం.. శ్రీ బాలాజీ అంకాలజీ ఆస్పత్రికి శంకుస్థాపన

TTD Chairman YV Subba Reddy About Pink Buses - Sakshi

సాక్షి,  తిరుపతి: వెంకన్న సన్నిధిలో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి అడుగు పడింది. శ్రీ బాలాజీ అంకాలజీ ఆస్పత్రికి  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ. 124 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

ప్రతీ జిల్లాకు పింక్‌ బస్సులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తలు, టెస్టుల కోసమే ఈ బస్సులు. చిత్తూరు, తిరుపతిలో పింక్‌ బస్సుల ద్వారా స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారాయన. 

ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది
తిరుమల ఘాట్ రోడ్‌లో ఎలక్ట్రికల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘాట్ రోడ్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారాయన. ఒలెక్ట్ర బస్సు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాం. బస్సు కండిషన్‌ బాగానే ఉందని తెలుస్తోంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు భావిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్ లో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఐరన్ క్రాస్ బార్స్ ఎత్తు పెంచుతాము,  ఘాట్ రోడ్ పిట్ట గోడలు మరింత పటిష్టం చేస్తాం. భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తాం అని తెలిపారాయన. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top