ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్‌ భూమన

Ttd Chairman Bhumana Condemned Udhayanidhi Stalin Comments - Sakshi

సాక్షి, తిరుపతి: గోవిందా అని కోటిమార్లు వ్రాస్తే వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. 

ఈ క్రమంలోనే సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి, కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్న కరుణాకర్‌రెడ్డి.. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని హెచ్చరించారు.

కాగా, టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్‌​ వెల్లడించారు. గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని, చిన్నపిల్లల నుండి 25 సంవత్సరాల లోపు పిల్లలు గోవిందా కోటిని రాస్తారో వారి కుటుంబానికి విఐపీ దర్శనం కల్పిస్తామన్నారు.

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు..
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాల పంపిణీ
సెప్టెంబరు 18 నుండి 26 సాలకట్ల బ్రహ్మోత్సవాలు
అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు18 ధ్వజరోహణం సందర్భంగా సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారు
టీటీడీ క్యాలండరలు, డైరీలు సీఎం ప్రారంభిస్తారు
ముంబాయిలోని బంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచారకేంద్రం నిర్మాణానికి నిర్ణయం
29 స్పెషల్ డాక్టర్‌లు, 15 డాక్టర్లతో పాటు..  చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 ఉద్యోగుల నియామకాలకు అమోదం
2 కోట్ల 16 లక్షలతో మెడికల్, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు ఆమోదం. 
1700 టీటీడీ క్యూట్రాస్ ఆధునీకరణకి రూ.15 కోట్లు మంజూరు. 
టీటీడీలో 413 పోస్టులు  ప్రభుత్వ అనుమతికి పంపాము. 
47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలు ఆమోదం. 
కేశవాయన గంటా, బైరాగిపట్టడి ప్రాంతాలలో రోడ్లు ఆధునీకరణకి రూ.135కోట్లతో నిర్మాణం. 
తిరుపతిలో 1,2,3 సత్రాలు 1950లో నిర్మించారు. 2,3 సత్రాలను తొలగించి, అధునాతనమైన రెండు వసతి సముదాయాలు నిర్మాణం, అఛ్యతం, శ్రీ పధం అని పేరు ఒక్కో అతిధిగృహం 300 కోట్లతో నిర్మాణం.
రెండు రూ.600 కోట్లతో నిర్మాణం చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top