11 నుంచి 17వ తేదీ వరకు శిబిరాలు ఒక్కొక్క రోజు మూడు మండలాల్లో శిబిరాలు
పంపిణీ చేయనున్న
కృత్రిమ పరికరాలివీ..
పరీక్షలు నిర్వహించి దారిద్య్రరేఖ పరిమితికి లోబడి ఉన్న వారికి చేతికర్రలు, వాకర్లు, మూడు కాళ్ల చేతి కర్రలు, నాలుగు కాళ్ల చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రై సైకిల్, మూడు చక్రాలు సైకిల్, రోలేటర్లు, ఎంఎస్ కిట్లు, అంధుల చేతి వాచ్, అంధుల కర్రలు, వాయిస్ ఫోన్, ఎల్ బో క్రచస్, లైప్రసీ వ్యాధిగ్రస్తులకు కిట్లు, డైసీ ప్లేయర్స్, ఎంఎస్ ఐడీ కిట్స్, స్మార్ట్‌కేన్, కృత్రి మ అవయవ ఉపకరణాలు దివ్యాంగులు, వయోవృద్ధులకు పంపిణీ చేయనున్నారు.
అర్హులెవరు..
దారిద్య్రరేఖ దిగువన ఆదాయం ఉన్నవారందరూ అర్హులే. భౌతిక అవసరాలను ఆధారంగా సహాయ ఉపకరణాల వినియోగం తప్పనిసరైన వారు.. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఉపకరణాలు అవసరం అయిన వారు అర్హులు.
జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు
తిరుపతి అర్బన్: దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే అర్హులందరికీ ఉపకరణాలు అందుతాయోలేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. కాన్పూర్‌కి చెందిన అలింకో సంస్థ వారి సహకారంతో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు జి ల్లాలో మండలాల వారీగా దివ్యాంగులు, వయోవృద్ధులకు వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. ఒక్కొ క్క రోజు ఒకటి లేదా మూడు మండలాల చొప్పున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం కొనసాగించనున్నారు. 11వ తేదీ సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల్లో ఈ కార్య క్రమం ప్రారంభం అవుతుంది. 16వ తేదీ తిరుపతి అర్బన్ మండలం, 17వ తేదీ తిరుపతి రూరల్ మండలంలో శిబిరాల నిర్వహణ ప్రక్రియ ముగుస్తుంది. ఈ సందర్భంగా వారి వికలత్వాన్ని, పట్టుత్వాన్ని వైద్యులు పరీక్షలు చేసి, పరిశీలన చేస్తారు. అనంతరం వారికి కృత్రిమ పరికరాల పంపిణీకి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత నెల రో జుల వ్యవధిలో అధికారులు సూచించిన ప్రదేశంలో పరికరాలను అందించనున్నారు. దివ్యాంగులందరూ శిబిరాలకు హాజరయ్యేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
వెంట తెచ్చుకోవాల్సిన పత్రాలివీ..
దివ్యాంగులు శిబిరానికి వచ్చే సమయంలో యూడీఐడీ కార్డు రసీదు, ఆధార్ కార్డు, సదరం వైద్య ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు లేదా ఆధాయ ధ్రువీకరణ పత్రం జెరాక్స్ కాపీలు(రెండు సెట్లు), పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు రెండు, ఆధార్‌తో లింక్ ఉన్న మొబైల్ నంబర్ తీసుకురావాల్సి ఉంటుంది.
వయోవృద్ధులు శిబిరానికి తీసుకురావాల్సిన పత్రాలు
వయోవృద్ధులు శిబిరానికి వచ్చే ముందు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం జెరాక్స్ పత్రాలు(రెండు సెట్లు), నాలు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్‌తో లింక్ ఉన్న మొబైల్ నంబర్ తీసుకురావాల్సి ఉంటుంది.
80 శాతం ఉంటేనే బ్యాటరీ సైకిల్ జారీ


