నాయుడుపేట టౌన్: పట్టణంలోని చంద్రబాబు కాలనీలోని ముళ్ల పొదల్లో కనిపించిన పసిపాపకు స్థానిక సీహెచ్‌సీలో వైద్య చికిత్సలు చేసి, గురువారం తిరుపతిలోని శిశుమందిర్‌లో అప్పగించారు. పూర్తిగా కోలుకున్న పాపను వైద్యశాల నుంచి డిశ్చార్జ్ చేసి స్థానిక సీడీపీఓ ఉమామహేశ్వరీకి అప్పగించారు. దీంతో ఆమె మొదటగా పసిపాపను నెల్లూరు సీడబ్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) వారితో కలిసి నెల్లూరులోని శిశుమందిర్‌కు తరలించారు. అక్కడ శిశుగృహ మేనేజర్ లక్ష్మి పసిపాపను తిరుపతి శిశుగృహానికి తరలించాలని సూచించడంతో అక్కడి నుంచి సీడబ్ల్యూసీ కమిటీ వారు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మణెమ్మతో కలిసి తిరుపతి శిశుమందిర్‌కు తరలించారు. పట్టణంలోని చంద్రబాబు కాలనీ సమీపంలోని ముళ్ల పొదల్లో ముళ్ల పొదల్లో వేసి ఉన్న విషయమై స్థానిక ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మణెమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.


