తిరుమల: శ్రీవారి జూలై నెల దర్శన కోటాను టీటీడీ విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈడిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా 21న, అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు 23న, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, గదుల కోటాను 24న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. https://ttdevarthanamr.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


