ఏర్పేడు : తిరుపతి ఐఐటీ ఎదురుగా ఆదివారం గరుడ హెల్త్ సిటీ నూతన వెంచర్‌ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ప్రారంభించారు. 18 ఎకరాల సువిశాల స్థలంలో హెల్త్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సురేష్, చరణ్, రాజశేఖర్‌తో కలిసి బ్రోచర్ ఆవిష్కరించారు.
నేడు
‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారులు ఆదివారం తెలిపారు. తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు తమ సమస్యలను 8977716661 నంబర్‌కు కాల్ చేసి తెలియజేయవచ్చని వెల్లడించారు. ఫోన్ చేసిన సమయంలో వినియోగదారులు తమ విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
మే 12న
తిరుపతి గంగ జాతర
తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను మే 12వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఈ మేరకు గంగమ్మ ఆలయంలో జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మే 5వ తేదీ రాత్రి చేపట్టే చాటింపుతో అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమవుతుందన్నారు. 13వ తేదీ తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూపంతో జాతర ముగుస్తుందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాప్ చైర్మన్ రవినాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ మహేష్‌యాదవ్, నేతలు పనబాక లక్ష్మి, పసుపులేటి హరిప్రసాద్, సామంచి శ్రీనివాస్, ఈఓ జయకుమార్ పాల్గొన్నారు.


