
కంపెనీ గేటుముందు ధర్నా నిర్వహిస్తున్న పొగాకు రైతులు
కూటమి తీరుపై నిరసన
జీపీఐ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై ధర్నా
గడివేముల: కంపెనీల మోసం, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పొగాకు రైతులు సోమవారం నందికొట్కూరు– నంద్యాల ప్రధాన రహదారిపై జీపీఐ కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది రైతులు పొగాకు బేళ్లను విక్రయానికి తీసుకొచ్చారు. అయితే కంపెనీ ప్రతినిధులు రూ.3 వేల కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయలేమని చెప్పడంతో రైతులు ప్రధాన రహదారిపై కూర్చొని న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని భీషి్మంచారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కంపెనీ నిర్వాహకులు నాణ్యత పేరుతో తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పొగాకు బేళ్లను తీసుకొచి్చన ప్రతిసారి ధరలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతులను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రామచంద్రుడు ధ్వజమెత్తారు. గత ఏడాది సాగు చేసిన పొగాకు దిగుబడిని ఇంత వరకు రైతులు అమ్ముకోకుండా ఇళ్లలో నిల్వ చేసుకున్నారని.. పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో అప్పులు తెచ్చుకున్న చోట నానామాటలు పడాల్సి వస్తోందన్నారు.
రైతులతో రూ.12 వేల నుంచి రూ.18 వేల ధరతో కొనుగోలు చేస్తామని జీపీఐ పొగాకు సంస్థ ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు రూ. 3 వేలకే కొనుగోలు చేస్తామని చెప్పడం నిలువునా మోసం చేయడమేనన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షాన నిలబడి పండించిన పంటలకు మద్ద«తుధర ప్రకటించి నిర్ణీత సమయంలోనే నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేశారు. గతంలో మాదిరిగా రేటు ఉంటుందన్న ఆశతో నాకున్న ఆరు ఎకరాల్లో పొగాకు పంటను సాగుచేశానని కడప జిల్లా పెద్దమూడియం గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి తెలిపారు.