తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదు | Tirumala laddu ghee does not contain any animal fat | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదు

Oct 7 2026 4:25 AM | Updated on Oct 7 2026 4:31 AM

Tirumala laddu ghee does not contain any animal fat

నెల్లూరు ఏసీబీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ సిట్‌

ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌ పరీక్షల్లో ఇదే తేలింది 

మైసూర్‌ సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ పరీక్షల్లోనూ జంతు కొవ్వుల్లేదని స్పష్టమైంది 

చంద్రబాబు అండ్‌ కో ఆధారంగా చేసుకున్న ఎన్‌డీడీబీ కూడా జంతు కొవ్వు లేదనే చెప్పింది 

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌వి తప్పుడు ఆరోపణలేనని తేల్చిన సిట్‌ 

నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని గుజరాత్‌ ఎన్‌డీడీబీ ల్యాబ్‌ పరీక్షల్లో తేలిందని బాబు అండ్‌ కో రాద్ధాంతం 

రాజకీయాల కోసం దేవదేవుడినే వాడుకున్న చంద్రబాబు బృందం 

తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బాబు  

సాక్షి, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం దేవ­దేవుడినే వాడుకొని, తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మాజీ ముఖ్య­మంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు అండ్‌ కో చేసిన కుట్రలు మరోసారి పటాపంచలయ్యాయి. చంద్రబాబు నీచ రాజకీ­యాల కోసం తిరుమల శ్రీవారినీ వాడుకోవాలన్న కుతంత్రాలకు తెరపడింది. తిరుమల శ్రీవారి లడ్డూ­లో జంతు కొవ్వులు కలిశాయంటూ నానా రాద్ధాంతం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేసిన చంద్రబాబు, ఆయన బృందం ఆరోప­ణ­లన్నీ అవాస్తవా­లేనని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మరోసారి తేట­తెల్లం చేసింది. 

చంద్రబాబు అండ్‌ కో ఆరోపించిన విధంగా శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, ఇతర జంతువుల కొవ్వులు లేవని నెల్లూరు సీబీఐ కోర్టు­లో దాఖలు చేసిన ప్రధాన ఛార్జిషీట్‌లో చెప్పిన సీబీఐ.. ఇదే కోర్టుకు తాజాగా సమర్పించిన అను­బంధ ఛార్జిషీట్‌లోనూ ఇదే విషయం మరోమారు విస్పష్ట­ంగా చెప్పింది. చంద్రబాబు అండ్‌ కో వైఎస్‌ జగన్‌­పైన, ఆయన ప్రభు­త్వం పైన బురద జల్లేందుకు గుజరాత్‌లోని నేష­నల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) నివేదిక ఆధార­మంటూ చేసిన ప్రచారమంతా అబద్ధమని మరొకసారి సిట్‌ తేల్చింది. నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవ­లే­దని ఎన్‌డీడీబీ నివేదిక తేటతెల్లం చేసినట్లు అను­బంధ ఛార్జిషీట్‌­లో తేల్చి చెప్పింది.

ఏఆర్‌ డెయిరీకి చెందిన నాలుగు నెయ్యి ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలపై హరియాణాలోని నేష­నల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌డీఆర్‌ఐ) ల్యాబ్‌­లో చేసిన పరీక్షల్లో కూడా జంతు కొవ్వులేవీ లేవని తేలిందని నివేదించింది. అంతే కాక మైసూర్‌ సీఎఫ్‌­టీ­ఆర్‌ఐ ల్యాబ్‌లో పరీక్షించిన బోలే బాబా డెయిరీ నెయ్యి నమూనాల్లో కూడా జంతు కొవ్వులు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్‌ సేకరించిన వివరా­లతో నెల్లూరు ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్‌ నివేదికలో పేర్కొన్న ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌ రిపోర్టు 

జంతువుల కొవ్వు లేదని మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ ఇచ్చిన రిపోర్టు   

ప్రధాన చార్జిషీట్‌లోనూ ఇదే మాట... 
గతంలో కూడా సిట్‌ నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రధాన ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అందులో కూడా లడ్డూ నెయ్యి­లో ఎలాంటి జంతువుల కొవ్వు­లు లేవని తేల్చింది. ఈ వ్యవ­హారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరు­పుతున్న ఎన్‌ఫో­ర్స్‌­మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులేవి కలవలేదని స్పష్టంగా చెప్పింది.ఎన్‌డీబీబీ నివేదిక అంటూ చంద్రబాబు రాద్దాంతంచంద్రబాబు, ఆయన గణం.. వైఎస్సార్‌సీపీ అధి­నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై బురద జల్లేందుకు తిరుమల శ్రీవారినే వాడుకొ­న్నారు. చంద్ర­బాబు తిరుమల శ్రీవారి లడ్డూలో పంది, ఇతర జంతువుల కొవ్వు కలిపారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభా­వాలను దెబ్బ తీసే ప్రయ­త్నం చేశారు. 

ఇందుకోసం గుజరాత్‌లోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డీడీబీ) నివేదిక ఆధారం అంటూ ప్రజలను మభ్య పెట్టారు. అయితే అదే ఎన్‌డీడీబీ 2025లో ఇచ్చిన నివేదికలో లడ్డూ నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని విస్పష్టంగా చెప్పింది. ఈ నివేదికను కూడా సిట్‌ తన తాజా అనుబంధ ఛార్జిషీట్‌లో జత చేసి కోర్టు ముందుంచింది. దీంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌ తదితరులు చేసిన ఆరోపణలన్నీ తప్పుడు­వేనని, వారంతా చేసింది దుష్ప్రచారమేనని తేలిపో­యింది. కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా శ్రీవారి భక్తుల మనోభా­వాలతో ఆటలాడుకు­న్నారని స్పష్టమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement