breaking news
Animal fat
-
‘లడ్డూ’పై బాబు సర్కారు ఏకసభ్య కమిటీ.. నేడు ‘సుప్రీం’లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం... దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించటాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.సీఎం అబద్ధాలు ప్రచారం చేశారురాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని తన పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై రాజకీయ కుట్రలు, వాస్తవాలను వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.స్వయంగా ‘సుప్రీం’ పర్యవేక్షిస్తున్నా ఏకసభ్య కమిటీనా..? లడ్డూ ప్రసాదం విషయంలో నిగ్గు తేల్చేందుకు స్వయంగా సుప్రీంకోర్టు ఇప్పటికే జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ విచారణ కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్‌తో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, న్యాయ ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమని పిటిషన్లో నివేదించారు.కుట్ర బెడిసికొట్టడంతో కమిటీ పన్నాగం!శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ లాబ్‌లు స్పష్టం చేయగా సీబీఐ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమైంది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ ఒక్క వైఎస్సార్సీపీ నేత పేరును ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు దుష్ప్రచారం బెడిసికొట్టడంతో మరో కొత్త కుత్రంత్రానికి తెర తీశారు. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలనే రాజకీయ కుట్రతో దినేష్ కుమార్ కమిటీని నియమించారు.బాబు సర్కారుపై ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు..చంద్రబాబు సర్కారు దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి..’ అంటూ చంద్రబాబునుద్దేశించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం, ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించడంపై దాఖలైన పిటిషన్ నేడు విచారణకు రానుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.స్వామి పిటిషన్లో ఆరుగురు ప్రతివాదులు వీరే..⇒ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం⇒ కేంద్ర ప్రభుత్వం ⇒ చంద్రబాబు (ఏపీ సీఎం)⇒ సిట్ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బందం)⇒ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)⇒ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) -
‘లడ్డూ’పై విచారణకు కమిషన్!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్ దర్యాప్తులో వెల్లడికావడం.. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ న్యాయస్థానంలో దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. చార్జిషీట్లో అప్పటి టీటీడీ పాలకమండలి చైర్మన్ సహా కమిటీ సభ్యులందరినీ చేర్చడంపై సుదీర్ఘంగా మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇప్పటికే అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినందున ఇక ‘సిట్’ పరిధి ముగిసిందనే నిర్ణయానికి వచ్చిన మంత్రివర్గం దీనిపై తదుపరి విచారణకు ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించింది.అయితే స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్ దర్యాప్తు నివేదిక వచ్చాక కూడా మళ్లీ విచారణ కమిషన్ ఎందుకని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినందున విచారణ పరిధి ముగిసిందని భావిస్తున్నట్లు మంత్రి కేశవ్ చెప్పారు. ‘అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సహా కమిటీ సభ్యులందరినీ నేరస్తులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సీబీఐ సిట్ తన లేఖలో చర్యలు తీసుకోవాలని ప్రస్తావించిన అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు స్వల్పకాలిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భోలే బాబా 2019 ఏప్రిల్‌లోనే టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ అది ఎన్నికల సమయం’ అని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్ధసారధితో కలసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు.చార్జిషీట్లో లోపాలపై చర్చించాం: మంత్రి పయ్యావులటీటీడీ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మాట్లాడారు. ఎన్డీడీబీ అనుమానిత రిపోర్టు ఆధారంగానే సీఎం మాట్లాడారు. అయితే ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్టు ఉందని సీఎం చెప్పలేదు. ఎన్డీడీబీ తన రిపోర్టులో ‘ఎస్’ విలువలో హెచ్చుతగ్గులున్నందున జంతు కొవ్వు అవశేషాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దాని ఆధారంగానే సీఎం మాట్లాడారు. నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ సిట్ ప్రభుత్వానికి సూచించింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో లోపాలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం.2022లోనే నెయ్యి కల్తీ జరిగినట్లు నివేదిక ఉన్నప్పటికీ అప్పటి టీడీటీ చైర్మన్ సహా కమిటీ సభ్యులెవరూ చర్యలు తీసుకోకుండా నివేదికను తొక్కిపెట్టారు. అంతకు ముందే నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనలను సడలించారు. దీన్నిబట్టి మొత్తం కమిటీ సభ్యులకు తెలిసే దురుద్దేశపూర్వకంగా నెయ్యి కల్తీకి పాల్పడ్డారని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఐ చార్జిషీట్‌ను కోర్టు ఇంకా అధికారికంగా స్వీకరించలేదు. అధికారికంగా స్వీకరిస్తే గానీ అందులో ఎవరున్నారు? ఎవరిని చేర్చలేదనేది తెలియదు. చార్జిషీట్లో లోపాలుంటే కోర్టు వెనక్కు పంపించే అవకాశం ఉంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో వైవీ సుబ్బారెడ్డితో పాటు కమిటీ సభ్యుల పేర్లు లేకపోతే వారిని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అడ్వకేట్ జనరల్‌ను మంత్రివర్గ భేటీకి పిలిచి సలహా కోరాం. కల్తీ నెయ్యి గురించి ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకువెళ్లాలని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో సూచించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా నిజాయతీగా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారన్నారు. కల్తీ నెయ్యి గురించి 2022లోనే నివేదిక వచ్చినా జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే సీఎం చంద్రబాబు చెప్పారని, బోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలియాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. టీటీడీ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ తనను కాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్‌రెడ్డి, భాస్కరరెడ్డిని పిలిచేవారని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. -
చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం!
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ – నెల్లూరు న్యాయస్థానంలో తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమై స్థానంలో ఉంటూ రాజకీయ కుట్రలతో ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసిందన్న తన నిరాధార ఆరోపణలు బెడిసికొట్టడం.. ముఖ్యమంత్రి హోదాలో మహాపచారానికి పాల్పడటంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటం, దారుణమైన అబద్ధాలాడిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తుండటంతో సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో తన పాచిక పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం మరో పన్నాగం పన్నింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టులు కేటాయించారని.. చిన్నప్పన్నను వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ వక్రీకరణలకు పాల్పడుతోంది. కట్టబెట్టింది టీడీపీ హయాంలోనే.. చార్జ్‌షీట్‌లో వెల్లడించిన సీబీఐ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించేందుకు చంద్రబాబు బృందం పడరాని పాట్లు పడుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. భోలే బాబా డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. భోలే బాబా కంపెనీకి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారని సీబీఐ చార్జ్‌షీట్‌లో వెల్లడించడం గమనార్హం. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొంది. ‘లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ అని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. .ఆ శాంపిల్స్.. బాబు సీఎం అయ్యాక తీసినవే ఇక ప్రస్తుతం కల్తీ అంటూ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక తీసిన శాంపిల్స్ అవి! ఆ నెయ్యి శాంపిల్స్ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో తీసినవే. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగింది. మరి ఆ నెయ్యిలో కల్తీ ఉంటే అందుకు బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనన్నది సుస్పష్టం. కొనుగోలు కమిటీలో కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చంద్రబాబు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే... వైఎస్సార్సీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సభ్యులుగా ఉన్నారు. నాడు టీటీడీ పర్చేజ్ కమిటీలో సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. అదంతా కల్తీయేనా బాబూ?2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి నెయ్యి కిలో రూ.276 – రూ.314 మధ్య కొనుగోలు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే అది తక్కువే. మరి దాన్ని బట్టి బాబు సర్కారు కొన్న నెయ్యి అంతా కల్తీయేనని భావించాలా? శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే..! తిరుమల శ్రీవారి నిధుల వినియోగంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. అందుకు టీటీడీ తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవరే నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లలో టీటీడీ 67 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం వెచ్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ కనీసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని వారించినా లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్ నిర్మాణానికి టీటీడీ పాలకమండలిలో తీర్మానం చేసింది. అంతేకాదు.. నిర్మాణ వ్యయాన్ని రూ.40 కోట్లు తగ్గించి శ్రీవారి నిధులను ఆదా చేసింది. ఇక టీడీపీ హయాంలో టీటీడీ నిధులు రూ.1,300 కోట్లు ప్రైవేట్ రంగంలోని ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడంపై తీవ్ర విమర్శలు రేగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించి... ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయించింది. తప్పుడు నివేదిక బాబు హయాంలోనే.. గతంలో భోలే బాబా డెయిరీ పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ’. ఆ పేరుతోనే 2018 మేలో తొలిసారి టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. లీటరు నెయ్యి కేవలం రూ.290కే సరఫరా చేస్తామని టెండరు వేస్తే టీటీడీ సమ్మతించి కాంట్రాక్టు కట్టబెట్టింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. హర్ష్ డెయిరీని తనిఖీ చేసేందుకు 2018 ఏప్రిల్ 17న అప్పటి టీటీడీ ఈవో నిపుణుల కమిటీని పంపారు. కానీ ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చి మోసగించింది. హర్ష్ డెయిరీ రోజుకు 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని... రోజుకు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ విధంగా తప్పుడు నివేదిక ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 18న 82 వేల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ మళ్లీ పాల్గొని టెండరు దక్కించుకుంది. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు...ఏపీ భవన్ ఉద్యోగి తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్ర చారం చేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన్ను వైవీ సుబ్బారెడ్డి పీఏగా దుష్ప్ర చారం చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. తిరుమల లడ్డూపై దుష్ప్ర చారం ఆపాలని, నిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ నేతలు కాదు. ఇక సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో వైఎస్సార్ సీపీ నేతలు సహా గత ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లు ఏ ఒక్కరివీ లేవు. రాజకీయ కుట్రతో ఇంతటి బరితెగింపా బాబూ...! కేవలం రాజకీయ స్వార్థం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డారు. సీఎం హోదాలో దుష్ప్ర చార కుట్రకు బాబు నేతృత్వం వహించగా టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన సాగించి అమలు చేశారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది, చేప కొవ్వులు కలిపారంటూ చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేశారు. ఏమాత్రం పాపభీతి లేకుండా శ్రీవారి ఆలయ పవిత్రతకు కళంకం తీసుకువచ్చేందుకు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేందుకు కుతంత్రం పన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం..’ అనే పేరుతో 2024 సెప్టెంబర్ 20న ఒంగోలులో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని దీనికి వేదికగా చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారు. ఇక నారా లోకేశ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపి అపవిత్రం చేశారని దారుణమైన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిపినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొనడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే... తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడి కాలేదు. కేవలం రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు, ఆయన ముఠా ఎల్లో మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పక్కా పన్నాగం పన్నింది. ఇదిగో.. పంది కొవ్వు ఇంత శాతం..! ఆవు కొవ్వు ఇంత శాతం..! చేప కొవ్వు ఇంత శాతం..! అంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా పేజీలకు పేజీలు అవాస్తవ కథనాలతో దుష్ప్రచారం చేశాయి. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తెచ్చే కుట్రలో పాత్రధారిగా మారిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశి్చత్తం డ్రామాకు తెరతీశారు. మీడియా కెమెరాల ముందు విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లు కడిగి హైడ్రామాను రక్తి కట్టించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతారం ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు.. సీబీఐ దర్యాప్తులో వెల్లడి.. చార్జ్‌షీట్‌లో స్పష్టీకరణ తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. ఈమేరకు నెల్లూరులోని న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సీబీఐ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్ర చార కుట్రలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు వెంటనే ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ప్రభుత్వ పెద్దలు అమరావతికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాతే ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ నివేదిక వెల్లడించింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. శాస్త్రీయంగా విశ్లేషణ... సాధికారికంగా నిర్ధారణ... టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఆ విషయాన్ని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ)లకు పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యా»ొరేటరీలు 2025 మార్చి 27, 2025 మే 16న రెండు వేర్వేరు నివేదికల్లో నిర్ధారించాయని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలె్రస్టాల్ ఉంటుంది. కొలె్రస్టాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. నెయ్యి కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థరాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే కుట్రతో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. టీటీడీ అనుసరించే పటిష్ట విధానం ఇదీ... లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్ 1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి. ఓ ట్యాంకర్ నెయ్యి శాంపిల్‌లో 99.618 శాతం మిల్క్ ఫ్యాట్ ఉందని తేల్చుతూ ఎన్డీడీబీ కాల్ఫ్ 2024 జూలై 23న ఇచ్చిన టెస్ట్ రిపోర్టు ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చునని ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు 2024 జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులో పేర్కొన్న టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా కేజీ నెయ్యిలో 208.851 మిల్లీ గ్రాముల వెజిటబల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కూడా కలిసి ఉండే అవకాశం ఉందని 2024 జూలై 28న ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులో స్పష్టం చేసిన టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ 2024 జూలై 6, జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అదే నెల 22న సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న టీటీడీ అప్పటి ఈవో శ్యామలరావు (ఈయనే నెయ్యిలో జూలై 23న వనస్పతి డాల్డా వంటి వెజిటబుల్ ఆయిల్ కలిసిందని తిరుమలలో ఏడుకొండలస్వామి సాక్షిగా మీడియాకు చెప్పారు) » అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు. » తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవాలు. బాబు దుష్ప్రచారంపై జాతీయ మీడియాలో విమర్శల వెల్లువ తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కుట్ర పన్నడంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. జంతువుల కొవ్వు కలిసింది అంటూ నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ శ్రీవారి భక్తులు, వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేయడాన్ని జాతీయ మీడియా ప్రస్తావించింది. -
వేద మంత్రాలతో.. హోరెత్తిన నిందా పరిహార హోమం
తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిందాపరిహార హోమాన్ని నిర్వహించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికతో స్పష్టమవడంతో ఇప్పటి వరకు ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారంతో దెబ్బతిన్న శ్రీవారి పవిత్రతకు, ప్రతిష్టకు ప్రాయశ్చిత్తంగా తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భూమన దంపతులు పాల్గొన్న ఈ కార్యక్రమం వేదమంత్రాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదంపై రాజకీయ నిందలా? ‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచపు అపనిందలు మోపారు. ఆ ఇద్దరూ కుమ్మకై దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్‌కళ్యాణ్ అయితే దుర్గా మాత గుడి మెట్లు కడిగి అత్యంత నీచంగా ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో విష ప్రచారానికి తెగబడ్డారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నిందలకు పరిహారంగా శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమం నిర్వహిస్తున్నాం. దీనిద్వారా అపవాదులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం. అయితే, లడ్డూ ప్రసాదంలో ఎక్కడా జంతు కొవ్వు కలవలేదని, ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని సీబీఐ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు చెంపపెట్టుగా మారింది. దీనిని వారు జీర్ణించుకోలేక అనుకూల పత్రికలు, ఛానళ్ల ద్వారా ఇంకా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించడం దారుణం’ అని భూమన అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలు ఇక తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పార్టీలు అడ్డంగా దొరికిపోయినప్పటికీ, టీడీపీకి చెందిన కొందరు ఇప్పటికీ ప్రసాదంపై విషప్రచారం చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లడ్డూతో వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్ చేస్తూ, మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టులు.. వివిధ ప్రాంతాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలను మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయని, శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు పెడుతున్నారని వారు ఆరోపించారు. హోమం భగ్నానికి యత్నం శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమాన్ని ఎలాగైనా భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన గూండాలు ఒక్కసారిగా భూమన నివాసానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. హోమం సమీపంలో నానాయాగీ చేస్తూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. ఫలితంగా స్థానికులు, హోమానికి హాజరైన వేద పండితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ దుష్ప్రచారాలు ప్రజల్లో బట్టబయలవుతాయన్న భయంతో కూటమి నేతలు హోమాన్ని అడ్డుకునేందుకు రౌడీమూకలను దింపారని భూమన ఆరోపించారు. టీడీపీకి చెందిన రాక్షస శక్తులు హోమం జరుగుతున్న తమ ఇంటిపై దాడికి ప్రయత్నించాయని, 100 మందికి పైగా రౌడీమూకలు అన్నమయ్య భవన్ సమీపంలో వీరంగం సృష్టించారని ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి విష సంస్కృతిని తీసుకొచి్చంది కూటమి పార్టీల పెద్దలేనని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాన్ని రౌడీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన నేతలే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. -
బాబు కుట్రకు శిక్ష ఉండొద్దా?
‘ఆత్రగాడికి బుద్ధి మట్టు...’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ప్రత్యర్థులపై బురద జల్లడం కోసం, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్మాదం ఆవహించిన చందాన 2024 సెప్టెంబర్‌లో ఒక మహాపరాధానికి పాల్పడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ఆరోపణకు సాహసించి ప్రపంచవ్యాప్తంగావున్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నిజం నిలకడ మీద తేలుతుందన్నట్టు ఇన్ని నెలల తర్వాత ఇదంతా పచ్చి బూటకమని సీబీఐ దర్యాప్తు నిగ్గుతేల్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి లడ్డూకు వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలో ఆవగింజంతైనా నిజం లేదని నిర్ధారించింది. హరియాణాలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)లు వేర్వేరుగా ఆ నెయ్యి నమూనాలను పరీక్షించి వెల్లడించాయని సీబీఐ తన చార్జిషీటులో తెలియజేసింది. ఈ నమూనాలు నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించామని వివరించింది. చిత్రమేమంటే తమ కుట్ర భళ్లున బద్దలైనా టీడీపీ నాయకు లకూ, వారి వందిమాగధ మీడియాకూ బుద్ధి రాలేదు. కిందపడ్డా తమదే పైచేయి అని చెప్పటానికి నానా తంటాలూ పడుతున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మరిన్ని వేల అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ఇలాంటి వంచకులను ఆ భగవంతుడు క్షమిస్తాడా? ప్రత్యర్థులపై పైచేయి సాధించ టానికి ఎత్తులు, పైయెత్తులేయటం... ఎలాగైనా గెలిచితీరాలని ఆత్రపడటం రాజకీ యాల్లో సర్వసాధారణం. కానీ మనిషి జన్మ ఎత్తినందుకు కనీసంగానైనా ఇంగితంఉండొద్దా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంపైనే నదురూ బెదురూలేకుండా విషం చిమ్మటం మహాపచారమన్న స్పృహ ఉండనవసరం లేదా? ఈ కుట్ర వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయి. అప్పటికి ఎడతెరిపి లేని వానలతో పొంగి ప్రవహిస్తున్న బుడమేరును కనీస ముందస్తు హెచ్చరిక లేకుండా, చడీచప్పుడూ కాకుండా వదలటం వల్ల విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. 50 మందికి పైగా దుర్మ రణం పాలయ్యారు. అది సర్కారీ జలప్రళయమని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు తన కొంప కాపాడుకునేందుకే ఇలా చేయించారన్న విమర్శలూ వచ్చాయి. అంతేకాక ఎన్నికల సంఘం ఎంతో తాత్సారం చేసి, నిబంధనలు కాలరాసి ఏపీలో ఎన్నికలు జరిగిన 108 రోజుల తర్వాత బూత్‌ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలతో కూడిన ఫామ్–20ని సెప్టెంబర్ 19న ఆన్లైన్లో పెట్టడానికి నిర్ణయించుకుంది. సరిగ్గా ఈ రెండు ఉపద్రవాలనుంచీ కాపాడుకోవటం కోసం అర్జెంట్‌గా జనందృష్టిని మళ్లించాలన్న ఆత్రుతలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు కూతలు మొదల య్యాయి. ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్కతాళం వేశారు. అయోధ్యకు జంతువుల కొవ్వు కలిసిన లక్ష లడ్డూలు వెళ్లాయంటూ వదిరారు. ఇరు పార్టీలూ ఇలా దుష్ప్రచారం చేస్తున్నా, అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. సొంత మనుషులతో సిట్ వేసే ప్రయత్నం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌తో బెడిసికొట్టింది.అవకాశం దొరికినప్పుడల్లా ‘నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువున’ని స్వోత్కర్షలకు పోయే చంద్రబాబుకు వాస్తవంగా అలవాటైన ఏకైక విద్య అబద్ధాలాడటం. దాని సాయంతోనే తన మామ ఎన్టీఆర్ నుంచి కుట్రపూరితంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంతకు ముందూ తర్వాతా కూడా తన ఎదుగుదల కోసం ఆయన చేయని పాపమంటూ లేదు. వీటన్నిటికీ పరాకాష్ఠ లడ్డూ ప్రసాదంపై సాగించిన దుష్ప్రచారం. ఇదే నేరాన్ని మరెవరైనా చేసివుంటే వ్యవస్థలు ఊరుకుంటాయా? కేసులు, శిక్షలూ లేకుండా వదులుతాయా? అందలాలెక్కినవారికి మాత్రం ఎందుకు మినహాయింపులుండాలి? ఇన్నేళ్ల పాపాలను ఈ అవసాన దశలోనైనా కడిగేసుకుందామనీ, ఇక బుద్ధెరిగి ప్రవర్తిద్దామనీ చంద్రబాబు అనుకోకపోవటం తెలుగు ప్రజల దురదృష్టం. -
జంతువుల కొవ్వుతో కల్తీ వంట నూనె కలకలం
ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసి, రూ.1.5 లక్షల విలువైన కల్తీ వంట నూనె, క్రూడాయిల్, తయారీ సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ వంట నూనె తయారు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం రావడంతో జాతీయ రహదారిని ఆనుకుని కాకినాడ వాసి ప్రతాప్‌సింగ్‌కు చెందిన రేకుల షెడ్డులో కల్తీ వంట నూనె తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జంతువుల కొవ్వు, చవగ్గా దొరికే క్రూడాయిల్ కలిపి, మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేస్తున్న పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలేనికి చెందిన బండారు ఫణి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిఠాపురం, చెందుర్తికి చెందిన స్నేహితులు ఏడిద విజయ్‌కుమార్, ఆరుగుల సురేష్ కుమార్ల వద్ద తక్కువ ధరకు ఇతను జంతువుల కొవ్వు కొనుగోలు చేస్తున్నాడు. కాకినాడ లైట్ హౌస్ ప్రాంతానికి చెందిన చిట్టిబాబు నుంచి క్రూడాయిల్ తెచ్చి ఎఫ్‌కే పాలెంలో కల్తీ వంట నూనెలు తయారు చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శ్రీ వెంకటేశ్వరా ట్రేడర్స్ యజమాని సంతోషి శ్రీనివాస్‌దాస్, రాజమహేంద్రవరానికి చెందిన ఎండీ ఇర్ఫాన్‌తో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని, వారికి కల్తీ నూనె సరఫరా చేసేవాడు. కల్తీ నూనె డబ్బాలపై ప్రియ, కుక్పాల్, ఫ్రీడమ్, రుచి గోల్డ్, విరాట్, ఫస్ట్‌క్లాస్, పామ్ శక్తి తదితర బ్రాండ్ల లేబుల్స్ అతికించేవాడు. ఎఫ్‌కే పాలెంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో నాలుగు నెలల క్రితం తన వ్యాపారాన్ని ధర్మవరానికి మార్చాడు. గొల్లప్రోలు మండలం తాటిపర్తికి చెందిన నామా నాగూర్, నామా నానిబాబుకు ఎక్కువ కూలి ఇస్తూ, కల్తీ వంట నూనె వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ కేసులో 15 లీటర్ల పరిమాణం గల 56 డబ్బాల (840 కేజీలు) కల్తీ నూనె, నాలుగు డబ్బాల క్రూడాయిల్ (60 కేజీలు), ఒక స్టౌ, రెండు గ్యాస్ సిలిండర్లు, అల్యూమినియం గంగాళంలో తయారవుతున్న 225 కేజీల కల్తీ నూనె, 26 ఖాళీ డబ్బాలు, రెండు వైట్ కలర్ ప్యాకెట్లు, రెండు డబ్బా మూతల ప్యాకెట్లు, కొబ్బరి తాళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.50 లక్షలుగా నిర్ధారించారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులు కాగా ప్రధాన నిందితుడు బండారు ఫణి ప్రసాద్‌ను అరెస్టు చేసి, ప్రత్తిపాడు కోర్టులో హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు. ప్రజారోగ్యానికి హానికరమైన కల్తీ వంట నూనెలు తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పదని డీఎస్పీ శ్రీహరిరాజు హెచ్చరించారు. -
నకిలీ నెయ్యి కలకలం
పిఠాపురం: జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కాæసమాచారం మేరకు పిఠాపురంలో శుక్రవారం ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పిఠాపురంలోని రెండవ రోడ్డులోని పద్మావతినగర్‌లో బండారు ఫణి ప్రసాద్ ఇంట్లో సుమారు 400 కేజీల నకిలీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తయారీ దారులు కమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. రానున్న కార్తీకమాసాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా నకిలీ నెయ్యి తయారు చేసి ఆలయాల వద్ద విక్రయించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కమిషనర్ సైతం ధ్రువీకరించారు. ఇదే పిఠాపురంలో ఇలాంటి కేంద్రాలు ఇంకా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు దొంగలను పట్టుకోరా? ఇదిలా ఉండగా, ఈ విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ.. చాలా మందికి తెలియడంతో విషయాన్ని బయట పెట్టక తప్పలేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చెందుర్తి, కొడవలి, తాటిపర్తి తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో అనధికార కబేళాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ యథేచ్చగా గోవధ జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నెయ్యికి ఉపయోగించే జంతు కొవ్వు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలిసింది. గోవులను చంపి, అందులో కావాల్సిన మాంసాన్ని తీసుకుని.. మిగిలిన వ్యర్థ పదార్థాలను, ఎముకలను కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి, దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే నకిలీ నెయ్యిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిని పలు ఆలయాల్లో పూజలు, ప్రసాదాల తయారీ, దీపారాధనకు వినియోగిస్తున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి దందా వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు తెలిసింది. ఇంత జరిగినా అధికారులు అసలు వ్యక్తులను వదిలేసి.. వీళ్లే నిర్వాహకులంటూ కొందరిపై నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
బీ అలెర్ట్.. జంతు కళేబరాలతో కల్తీ నూనె..
ఉరుకులు.. పరుగుల నగరజీవికి కాసింత విశ్రాంతి దొరికేది భోజనం దగ్గరే.. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కొందరు ఉద్యోగులు ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఆకలి తీర్చుకునేందుకు టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చిరుతిళ్ల బండ్లను ఆశ్రయించాల్సిందే.. నోరూరించే బిర్యానీ.. వేడివేడి బజ్జీలు.. బాగా నూనె దట్టించిన దోశ.. ఇలా ఏది తిన్నా ఆరోగ్యానికి డ్యామేజీ అయినట్లే.. ఎవరు ఏ కల్తీ నూనె వాడుతున్నారో తెలియకపోవడంతో రోగాలు తప్పడం లేదు. కొన్నిచోట్ల జంతువుల వ్యర్థాలను మరిగించి తీసిన నూనెలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఆ నూనే వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి బేగంబజార్ కేంద్రంగా మార్కెట్లో విక్రయించి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడ, శాస్త్రిపురం, జలపల్లి, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాలు పశువ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి అడ్డాగా మారాయి. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల స్టిక్కర్లతో బేగంబజార్ కేంద్రంగా వాటిని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. పశువుల వ్యర్థాలతో నూనె తీసే ప్రాంతాల్లోకి ప్రవేశించడం సామాన్యులేవరికీ సాధ్యం కాదు. కోటలను తలపించే ప్రహరీల మధ్య ఈ గోడాన్లు ఉంటాయి. అక్కడ పనిచేసే వారంతా బిహార్, యూపీ, అసోం, ఓడిశా రాష్ట్రాలకు చెందిన యువకులే.. కొత్తవారు కనిపిస్తే దాడులకు ఏమాత్రం వెనకాడరు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులోనూ పశువ్యర్థాలతో తీసిన నూనె కలిపి పేరొందిన బ్రాండ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నూనెల ధరలు పెరుగుదల పశువుల వ్యర్థాలతో.. పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం.. చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నారు. మూతపడిన కార్ఖానాల్లో భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగబెట్టి నూనె తీస్తున్నారు. దాన్ని డబ్బాలు, ప్యాకెట్లలో నింపి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి జనంపైకి వదులుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ రోత పుట్టించే దందా సాగుతోంది మహానగర పరిధిలోనే.. ఏళ్లతరబడి ఖాళీగా పోస్టులు విశ్వ నగరం వైపు పరుగులు తీస్తూ కోటి మందికి పైగా జనాభా కలిగిన హెదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా విభాగం సిబ్బంది సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. జీహెచ్ఎంసీ ఆహార తనిఖీ విభాగానికి సర్కిల్ ఒకరి చొప్పున 30 పోస్టులు మంజురు కాగా, పని చేస్తోంది 20 మంది మాత్రమే. ఐదు గెజిటెడ్ పోస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారు. సర్కిల్ స్థాయిలో 10 పోస్టులు, గెజిటెడ్ స్థాయిలో మూడు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్‌లో 200 మందికి తగ్గకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఇటీవల కొన్ని ఘటనల్లో.. ఏడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారీ బండారం బయటపడింది. అక్టోబర్‌లో శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మైలాదేవులపల్లి పరిధిలోని అలీనగర్‌లో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న మూడు కేంద్రాలపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర శివార్లలోని జల్పల్లి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద పెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికిస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 160 డమ్ముల నూనె సీజ్ చేశారు. జల్పల్లి నుంచి పహాడీషరిఫ్‌కు వెళ్లే దారిలో కల్తీ నూనె దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న కేన్సర్ కేసులు గ్రేటర్లో ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 12వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగించడంతో రోగాలు పెరుగుతున్నాయి. కల్తీ నూనెతో రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ నూనె కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణమవుతుంది. ఆ నునె వాసన పీల్చినా ప్రమాదమే.. ఫిర్యాదులు అందితేనే.. ఈ విషపూరిత నూనెను అరికట్టేందుకు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు అందితే దాడిచేసి సీజ్ చేయడం.. తర్వాత ఫిర్యాదు అందే వరకు సంబంధం లేదనే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. ఫిర్యాదులు అందినప్పుడు నగర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై మొక్కుబడిగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగు రాదు. రంగు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జంతువుల కళేబరాలతో చేసిన నూనె పొంగుతో పాటు దుర్వాసన వస్తుంది. – డాక్టర్ ఆర్వీ రాఘవేందర్రావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
బ్రిటన్‌లో నాన్‌వెజ్ కరెన్సీ!
కరెన్సీ అంటే ప్రపంచమంతటికీ క్రేజ్. కొత్త నోట్లు చేతికి వస్తే వాటిని మురిపెంగా చూసుకుని నలగనివ్వకుండా భద్రంగా పర్సులో పెట్టుకుంటారు. కానీ బ్రిటన్‌లో అలా జరగలేదు. ఈ కొత్త నోట్లు మాకొద్దంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ నోట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తెర మీదకొచ్చింది. ఇంతకీ సంగతేమిటంటే... పేపర్ కరెన్సీ స్థానంలో ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు పాలిమర్ నోట్లను ప్రవేశపెడుతున్నాయి. ఆ క్రమంలో బ్రిటన్ కూడా కొత్త ఐదు పౌండ్ల పాలిమర్ నోటును విడుదల చేసింది. అయితే ఆ నోటును తాకడానికి, పర్సులో పెట్టుకోవడానికి విముఖంగా ఉన్నారు ఇంగ్లండ్‌లోని ‘హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్’ (హెచ్‌ఎఫ్‌బి) సభ్యులు. హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్ సభ్యుడు, అక్కడి ఇస్కాన్ ఆలయం డైరెక్టర్ అయిన గౌరీదాస్ ఈ నోట్లను ఉపసంహరించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వానికి, బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బు ఎందుకు వద్దు? కొత్త ఐదు పౌండ్ల నోటు తయారీలో జంతువుల కొవ్వు వాడినందున శాకాహారులు, వేగాన్ (కాయలు, పప్పు దినుసులు తప్ప పాల ఉత్పత్తులను కూడా తీసుకోరు)లు ఆ నోట్లను తాకడానికి ఇష్టపడడం లేదని హెచ్‌ఎఫ్‌బి ప్రతినిధులు చెప్తున్నారు. కరెన్సీ నోటు ‘సంపద దేవత’ అనీ, ఆ నోటుకు జంతువుల కొవ్వు రాయడం అపరాధం అని అంటున్నారు. నోట్ల తయారీ కోసం జంతువులకు హాని కలిగించడం దేవుడు మెచ్చని పని అని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేయడానికి ‘రిమూవ్ టాలో (కొవ్వు) ఫ్రమ్ బ్యాంక్ నోట్స్’ పేరుతో ఒక పిటిషన్ తయారు చేశారు. ఇందుకు సానుకూలంగా ట్విటర్లో లక్షా ఇరవై ఆరు వేల మంది స్పందించారు. ఈ పిటిషన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు చేరే నాటికి ఆ సంఖ్య లక్షా యాభై వేలకు చేరింది. కేంబ్రిడ్జిలోని రెయిన్బో వెజిటేరియన్ కేఫ్ నిర్వాహకుడు షరోన్ మీజ్ల్యాండ్ ఈ క్యాంపెయిన్‌కు స్పందించి ఆ నోట్లను స్వీకరించబోమని బోర్డు కూడా పెట్టేశాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బ్యాంకు అధికారులు కూడా అనుకూలంగా స్పందించారు. ‘‘మేము వారి (హెచ్‌ఎఫ్‌బి) మనోభావాలను గౌరవిస్తాం, దీనిని అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా పరిగణించి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాం’’ అని బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టడానికి కారణమైన ప్రొఫెసర్ డేవిడ్ శాలమన్ ఇది సరైన ఆలోచన కాదని అంటున్నారు. ‘‘ఐదు పౌండ్ల నోటు తయారీలో ఉపయోగించే జంతువుల కొవ్వు అత్యంత స్వల్పం. అది ఒక సబ్బు తయారీలో వాడే యానిమల్ ఫ్యాట్ కంటే తక్కువే. పేపర్ నోట్ల తయారీకైతే చెట్లను నరకాలి. అది పర్యావరణ పరిరక్షణకు విఘాతం. పాలిమర్ నోట్‌తో ఆ ఇబ్బంది ఉండదు. పైగా ఇది పేపర్ నోటు కంటే చాలా శుభ్రంగా ఉంటుంది. దీర్ఘకాలం కూడా మన్నుతుంది’’ అని ఆయన వాదన. -
జంతువుల కొవ్వుతో నూనె తయారీ
పోలీసుల అదుపులో నిందితులు పెద్దఅంబర్‌పేట: జంతువుల కొవ్వును కరిగించి నూనె తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ మండలం బాటసింగారంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.... సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ అజీద్ కబేళా నుంచి జంతువుల కొవ్వును తీసుకువచ్చి బాటసింగారం గ్రామానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు ఇచ్చి వాటిని కరిగించి నూనెను తయారు చేయిస్తున్నాడు. ఆదివారం స్థానికులు కొందరు గ్రామ పంచాయితీ వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో అక్కడికి వెళ్లి చూడగా జంతువుల కొవ్వును వంట పాత్రల్లో కరిగిస్తున్న దృశ్యం కనిపించింది. గ్రామ పెద్దలకు ఈ విషయం చెప్పగా వారు వెళ్లి ప్రశ్నించగా... సంతోష్‌నగర్‌కు చెందిన అజిద్ జంతువుల కోవ్వు పదార్థాలను తీసుకువచ్చి తమకు ఇస్తే వాటిని కరిగించి నూనెను తయారు చేస్తున్నామని, అందుకు రూ.200 చొప్పున కూలీ ఇస్తున్నాడని తెలిపారు. సమాచారం అందుకున హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇస్మాయిల్, ఫాతిమాలను అదుపులోకి తీసుకొని నూనె తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని, డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారు చేసిన నూనెను నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
జంతుకళేబరాలతో వంట నూనె తయారీ..!
నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : నిర్మల్ కేంద్రంగా జోరుగా జంతుకళేబరాలతో వంటనూనె తయారవుతోంది. క ల్తీ నూనె బాహాటంగానే తయారవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారు. అక్టోబర్ 12న రాంనగర్లో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున జంతుకళేబరాలతో తయారు చేసిన నూనెడబ్బాలు, జంతు కొవ్వు, ఎముకలు బయటపడిన సంఘటన అప్పుడు రాష్ట్రవాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన మరువక ముందే బాగులవాడలోని వాల్మీకినగర్‌లో గురువారం పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం తో, అప్పటికే నిందితులు డబ్బాలను మాయం చేశారు. అయితే పోలీసులు అక్కడ ఉన్న వారిని విచారించి చేతులు దులుపుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా.. హైదరాబాద్‌లోని జంతువుల కొవ్వు, ఎముకల తో నూనె తయారుచేసి విక్రయిస్తున్న ముఠా నిర్వాకం బయటపడిన విషయం తెలిసిందే. అయితే పట్టణంలోనూ వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ఇలాంటి ముఠాలు కోకొల్లలుగా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరికీ అనుమానం కలగకుండా కొందరు ఇళ్లలోనే కల్తీనూనె తయారు చేస్తున్నారు. కాలనీల్లోని సందుల్లో బట్టీలను ఏర్పాటుచేసి, జంతువుల కొవ్వును పెద్ద పెద్ద పాత్రల్లో వేసి ఉడికించి నూనె తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో వెలువడే దుర్గంధంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నా అధికారులెవరూ అడ్డుచెప్పకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా...? శివారు ప్రాంతాలు, మురికి ప్రాంతాలను కేం ద్రంగా చేసుకుని ఈ వ్యాపారాన్ని కొందరు య థేచ్ఛగా నిర్వహిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదరికాన్ని, యువత నిరుద్యోగా న్ని ఆసరా చేసుకుని తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తయారుచేసిన నూనెను డబ్బాల్లో నింపి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సమాచారం. నూనె చౌకగా లభిస్తుండడంతో పెద్ద వ్యాపారులు నూనె కొనుగోలు చేస్తున్నారు. దీంతో దందా మూడుపువ్వులు ఆ రుకాయలుగా కొనసాగుతోంది. వ్యాపారానికి ఎవరి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో కుటీర పరిశ్రమగా సాగుతోంది. కల్తీనూనె దారెటు..! జంతుకళేబరాలతో తయారుచేస్తున్న నూనెను తయారీదారులు ఎక్కడ విక్రయిస్తున్నారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. రాంనగర్ సంఘటనలో అధికారులు తయారీదారులను విచారించినప్పుడు వారు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. సబ్బుల తయారీలో వినియోగిస్తున్నామని ఓసారి, హోటళ్లు, తినుబండారాల్లో వినియోగం కోసం విక్రయిస్తున్నామని మరోసారి పొంతన లేకుండా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆహారపదార్థాల్లో ఈ కల్తీనూనెను వినియోగిస్తే.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. బలవుతున్న మూగజీవాలు...? కల్తీనూనె తయారీకి జంతువుల కళేబరాలు, కొ వ్వు, ఎముకలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నా రు. పలు ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల్లో ప్రతీ రోజు పదుల సంఖ్యలో లీటర్ల నూనెను త యారుచేస్తున్నారు. దీనికి కావలసిన ముడి సరుకుకోసం జంతువుల వధ తప్పనిసరి అవుతోంది. అయితే ఇంత పెద్దమొత్తంలో జంతువులను ఎ క్కడ వధిస్తున్నారనేది ప్రశ్నార్థకం. అయితే ని ర్మల్‌లో ఉన్న ఒకే ఒక్క జంతువధశాలకు కూడా అనుమతి లేదని అధికారులే చెబుతున్నారు. ఇంతకు ముందు పట్టణంలోని రాంనగర్లో ఇ లాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేసినా సాధించింది శూన్యం. స్వయంగా జిల్లా ఆహార అధికారి వచ్చి కల్తీ నూ నె డబ్బాలు పరిశీలించారు. సేకరించిన పదార్థాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరిశీలన కో సం పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. పూర్తి స్థాయి నివేదికలు అందాకే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు దాటవేస్తున్నారు. కళ్లముందే పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ జరుగుతున్నా, దానిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థా నికులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు పోలీసులు, మున్సిపల్ అధికారులు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏ ఒక్క శాఖ అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ తంతు చూస్తే పైస్థాయి నాయకులు, అధికారుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
ఆవిష్కరణం: టార్చ్‌లైట్ పూర్వరూపం లాంతరే!
నిప్పును నిరంతరం వెలిగే దీపంగా మార్చుకొని, దాన్ని ఒక కాంతిజనకంగా ఉపయోగించుకోవడం క్రీస్తు పూర్వం వేల ఏళ్ల క్రితమే మొదలైందని పరిశీలకుల భావన. గ్రీకు భాషలో వీటినే ‘లంపాస్’ అనే వారు. అవే ఇంగ్లిష్‌లో ‘ల్యాంప్’లు అయ్యాయి. క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో ఈ పదం వాడకంలోకి వచ్చింది. ఆ తొలినాళ్ల దీపాలే ‘టార్చ్లైట్లు’. అలాగే లాంతర్లను కూడా టార్చ్లుగానే భావించవచ్చు. నేటికీ వినియోగంలో ఉన్న లాంతర్లు 1783లో తొలిసారి ఆవిష్కృతం అయ్యాయి. అమీ ఆర్గండ్ అనే స్విస్ట్ కెమిస్ట్ వీటిని రూపొందించాడు. ఇవే చీకటిని చేధించి ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే నమ్మకమైన హ్యాండ్ ల్యాంప్స్‌గా మారాయి. తొలిరోజుల్లో జంతువుల కొవ్వుతో ఈ దీపాలను వెలిగించి, చీకటిలో ఉపయోగించే వారు. తర్వాత వంద సంవత్సరాలకు గ్యాస్, కిరోసిన్ ఇంధనంగా ఉండే లాంత ర్లను తయారు చేశారు. ఇవి ఆధునికంగా రూపాంతరం చెంది డ్రై సెల్ బ్యాటరీగా 1896లో అందుబాటులోకి వచ్చింది. అదే మనం వాడే ‘టార్చ్’. లిక్విడ్ రూపంలోని ఇంధనానికి భిన్నంగా పేస్ట్ ఎలక్ట్రోలైట్ల ద్వారా ఒక లైట్‌ను వెలిగించాలనే ఐడియా హ్యాండ్ బ్యాటరీ రూపకల్పనకు దారి తీసింది. తొలిసారి ఈ హ్యాండ్ల్యాంప్స్ను న్యూయార్క్ సిటీ పోలీసులు ఉపయోగించారు. రాత్రిపూట గస్తీ కోసం పరిశోధకులు వీటిని పోలీసులకు డొనేట్ చేశారు. ఆ విధంగా టార్చ్లైట్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. ఆ తర్వాత లైట్ల విషయంలోనూ, ముందువైపు ఉండే అద్దం విషయంలో అనే మార్పులు వచ్చాయి. తర్వాత ఎల్ఈడీలు, హెచ్ఐడీల రూపంలోని లైట్లతో బ్యాటరీలను రూపొందించారు. విద్యుత్ఘటాలతో, చార్జింగ్‌తో, కరెంట్‌తో పనిచేసే రకరకాల టార్చ్‌లైట్లూ వినియోగంలోకి వచ్చాయి.


