హైదరాబాద్: వైఎస్ వివేకా కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 28వ ఏ తేదీ) పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. గతంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లకూడదంటూ కండిషన్ బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. తాజాగా పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది.
ఇక విచారించాల్సిందేమీ లేదని సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో షరతులను హైకోర్టు సడలించింది. ఫలితంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.


