
సాక్షి టాస్క్‌ఫోర్స్: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (టీడీపీ) ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది.
అయితే, సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్‌చేసి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే నసీర్, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ రకంగా రాసలీలలు చేస్తున్న ఎమ్మెల్యే నసీర్ తీరుపై మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది.
