పంచాయతీల్లో టీడీపీ అత్యుత్సాహం | TDP leaders Over Action In Panchayat Elections | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో టీడీపీ అత్యుత్సాహం

Feb 4 2021 5:15 AM | Updated on Feb 4 2021 5:15 AM

TDP leaders Over Action In Panchayat Elections - Sakshi

కల్యాణదుర్గంలో పార్టీ కండువాలతో నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు

కళ్యాణదుర్గం రూరల్‌/వి.కోట (చిత్తూరు జిల్లా): పార్టీలకతీతంగా నిర్వహిస్తోన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరితెగిస్తోంది. సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా బుధవారం అనంతపురంలోని కల్యాణదుర్గం మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కండువాలతో నామినేషన్‌కు ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రానికి సమీపం వరకు కండువాలతోనే రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. అలాగే, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి పేరు ఖరారు కావడంతో బుధవారం టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు కార్లకు తగిలించుకుని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement