రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా | TDP Leaders Accused of Encroaching Government Lands in Ongole | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా

Apr 14 2025 7:20 PM | Updated on Apr 14 2025 7:34 PM

TDP Leaders Accused of Encroaching Government Lands in Ongole

ఒంగోలు,సాక్షి: ఒంగోలులో కూటమి నేతల బరితెగించారు. కేశవరాజు కుంటలో రూ.25 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.

కేశవరాజు కుంటలో సుమారు 5 ఎకరాల 60 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంపై కూటమి నేతల కన్నుపడింది. అంతే రూ.25కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేశారు. ప్లాట్లుగా వేసి అమ్మేందుకు సిద్ధమయ్యారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ పోల్స్‌ కూడా ఏర్పాటు చేశారు.

కూటమి నేతల భూకబ్జాపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ ఆందోళన చేశారు. టీడీపీ కబ్జాకి గురైన స్థలంలో నిరసన తెలిపారు. తక్షణమే రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని కంచె తీసేయాలని డిమాండ్‌ చేశారు. ఒంగోలులో కూటమి నేతల భూకబ్జాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement