వచ్చే ఎన్నికల్లో తేడా వచ్చినా... తట్టుకోలేం | TDP Leader Kala Venkata Rao Comments oN Next Elections | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో తేడా వచ్చినా... తట్టుకోలేం

Jun 25 2023 11:45 AM | Updated on Feb 9 2024 11:14 AM

TDP Leader Kala Venkata Rao Comments oN Next Elections - Sakshi

నర్సీపట్నం/మాకవరపాలెం: వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగిన పులి పంజాను ఏమాత్రం తట్టుకోలేమని సీఎం  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి టీడీపీ మాజీ మంత్రి కళావెంకటరావు అన్నారు. టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య యాత్రలో భాగంగా నర్సీపట్నంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారన్నారు. 

ఇప్పటి నుంచే పార్టీ విజయానికి  శ్రమించాలని, ఏమాత్రం తేడా వచ్చినా పులి పంజాకు తట్టుకోలేమన్నారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు ఉపన్యాసంలో ఎప్పుడు చెప్పే విషయాలే తప్ప కొత్తదనం లేదు. మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి, బండారు సత్యనారాయణమూర్తి ఊకదంపుడు ఉన్యాసం చేశారు. టీడీపీ నేతలు బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. సభ నిండుగా కనిపించేందుకు ప్రైవేట్‌ స్థలంలో మీటింగ్‌ ఏర్పాటు చేశారు. 

జనాలను నింపేందుకు టీడీపీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమయానికి గ్యాలరీ నిండకపోవడంతో మీటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. వచ్చిన జనాలు సైతం సభ జరుగుతుండగానే జారుకున్నారు. అంతకు ముందు మాకవరపాలెం మండలంలోని శెట్టిపాలె,  రాచపల్లి జంక్షన్‌ వద్ద  బస్సు యాత్రజరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement