Nov 8th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Judgement On Chandrababu Quash Petition Today In SC, Live Updates And Latest News In Telugu On Nov 8th - Sakshi
Sakshi News home page

Nov 8th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Wed, Nov 8 2023 6:56 AM | Last Updated on Wed, Nov 8 2023 7:00 PM

TDP Chandrababu Cases Petitions Nov 08 Updates - Sakshi

TDP Chandrababu Cases Petitions..

6:50 PM, Nov 8, 2023
అది బాబుకు మాత్రమే సొంతం
►గతంలో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు
►ఎన్నికల సమయంలో చంద్రబాబు నాలుగు మాయమాటలు చెప్తారు 
►ఆ మాటలతోనే అధికారం పొందాలని చూస్తున్నారు
►బీసీ వర్గాలను అణచివేసిన వ్యక్తి చంద్రబాబు
►చంద్ర బాబు హయాంలో ఎస్సీ, మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి లేదు
►సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదే
►ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు
పశ్చిమ గోదావరి పాలకొల్లు సామాజిక సాధికార యాత్ర సభలో వైఎస్సార్‌సీపీ నేతలు

6:36 PM, Nov 8, 2023
రేపు టీడీపీ పీఏసీ భేటీ
►నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ భేటీ
►చంద్రబాబు నివాసంలో గురువారం జరగనున్న పీఏసీ భేటీ
►టీడీపీ-జనసేన జేఏసీ భేటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చ
►ఉమ్మడి మేనిఫెస్టో, కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం రూపకల్పనపై కసరత్తు
►ఓటర్ల జాబితా పరిశీలనలో జనసేనతో కలిసి పని చేసేందుకు ప్రణాళికలు

6:25 PM, Nov 8, 2023
దొంగే ‘దొంగా దొంగా..’ అన్నట్లుగా..
►దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ నేతల తీరు
►సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,సోమిరెడ్డి,టీడీపీ నేతలు
►ఏపీలో ఓట్ల అవకతవకలంటూ కొత్త డ్రామా 
►ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు
►దొంగ ఓట్లపై చర్చకు టీడీపీ సిద్ధమా? అని ఎప్పటి నుంచో ప్రశ్నిస్తు‍న్న వైఎస్సార్‌సీపీ 
►తేలు కుట్టిన దొంగలా ఉంటూ.. డ్రామాలకు తెర లేపిన టీడీపీ, యెల్లో మీడియా

5:56 PM, Nov 8, 2023
చంద్రబాబు, పవన్‌.. ఇద్దరూ ద్రోహులే
►ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ
►చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్
►దళితుల్ని అణగదొక్కారు.. చదువుకు దూరం చేశారు
►పేదలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు అందిస్తుండడంపై పవన్ కల్యాణ్ దారుణంగా మాట్లాడారు
►యూట్యూబ్ చూసి ఇంగ్లీష్‌ నేర్చుకోవచ్చంటూ పవన్ హేళన చేశారు
►పవన్‌కు ఇదే నా సవాల్‌
►చదువంటే.. సినిమా డైరెక్టర్ చెప్పినట్లు చేయడం కాదు పవన్!
►పవన్‌.. నీకు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే మా పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడు

3:51 PM, Nov 8, 2023
సుప్రీంలో రేపు ఏం జరగనుందో?
►స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ వెలువడని తీర్పు
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం
►రేపు ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►నవంబర్‌ 9వ తేదీన విచారణ చేపడతామని గత విచారణలో చంద్రబాబు లాయర్లకు చెప్పిన ద్విసభ్య ధర్మాసనం
►ఫైబర్‌ పిటిషన్‌ విచారణ కంటే ముందే స్కిల్‌ పిటిషన్‌పై తీర్పు ఇస్తామంటూ స్పష్టీకరణ
►ఆ లెక్కన.. రేపు తీర్పు ఇచ్చాకే పిటిషన్‌ విచారించాల్సి ఉన్న బెంచ్‌
►లేకుంటే ఫైబర్‌ పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడే ఛాన్స్‌
►సుప్రీం పిటిషన్‌పైనే ఆధారపడిన ఏసీబీ కోర్టు పీటీ వారెంట్‌ నిర్ణయం
►సుప్రీం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఏసీబీ కోర్టు 
►చంద్రబాబు(Chandrababu)పై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేసిన సీఐడీ అధికారులు 
► ఫైబర్‌ నెట్‌ కేసులో.. టెరాసాఫ్ట్‌ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగం

2:34 PM, Nov 8, 2023
ఇసుక కుంభకోణం పిటిషన్‌ 22కి వాయిదా
►ఇసుక కుంభకోణంలో ఏ-2గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్‌
►ఈనెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం
►తదుపరి విచారణ ఈనెల 22 కు వాయిదా 

1:40 PM, Nov 8, 2023
ఐఆర్‌ఆర్‌ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏసీబీ కోర్టు విచారణ వాయిదా
►మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్‌
►విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. 

11:15 AM, Nov 8, 2023
మీడియా అనే వెంటిలేటర్ ఆధారంగానే బాబు రాజకీయం: YSRCP
►మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే మరి.. 
►అసలు టీడీపీకి ఉన్నదే ఎల్లో మీడియా బలం. 
►చంద్రబాబుకు ఏనాడూ ప్రజాబలం లేదు. 
►ఆనాడు ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసిన నాటి నుంచి ఇప్పటివరకూ ఎల్లో మీడియానే ఆధారం. 
►మీడియా అనే వెంటిలేటర్ ఆధారంగానే చంద్రబాబు రాజకీయాలు 
►వృద్ధనారి పతివ్రత అన్నట్లుగా మీరిప్పుడు నంగనాచి కబుర్లు చెబితే ఎలా?
►ప్రజల కోసం ప్రతిపక్షపాత్ర పోషిస్తాం అని చెప్పుకునే ఎన్ని చానెళ్లు, ఎన్ని పేపర్లు మీకు ఊడిగం చేయడం లేదు.
►మీ పాలనలో ఆ చానెళ్లకు దోచిపెట్టిన కాంట్రాక్టులు ఎన్ని? మీ అరాచకాలను దాచిపెట్టిన ఎల్లో ఛానెళ్ళు ఎన్ని?
►ఇవన్నీ రాష్ట్రంలోని పసి పిల్లాడికి కూడా తెలుసు. 
►ఇప్పుడు కొత్తగా మీరు లోకానికి చెప్పేదేమీలేదు.
►మీ తప్పులు ఎత్తి చూపే చానల్స్ చూస్తే మీకు ఉలుకెందుకు? 
►మీ అవినీతి, అరాచకాలను బయటపెట్టిన చానెళ్లు, మీకు అమ్ముడుపోని మీడియాలను ఇలాగే టార్గెట్ చేస్తారా? 
►ఇదెక్కడి రాజకీయం? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?.
►టైర్లలో గాలిపోయి, కదల్లేని స్థితిలో ఉన్న టీడీపీని బతికించేందుకు ఎల్లోమీడియాకు ఇంత ఆరాటం ఎందుకో మరి!


11:15 AM, Nov 8, 2023
బాబు ముందస్తు బెయిల్ విచారణ మధ్యాహ్నానికి వాయిదా
►ఇసుక కుంభకోణంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
►పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
►ఈరోజు మధ్యాహ్నం విచారించనున్న ఏపీ హైకోర్టు
►విధాన నిర్ణయాలకు నేరత్వం ఆపాదిస్తున్నారు
►17ఏ ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి
►పిటిషన్‌లో చంద్రబాబు నివేదన


11:00 AM,  Nov 8, 2023
టెర్రాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసుపై నేడు విచారణ
►ఫైబర్ నెట్ కేసులో టెర్రాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసుపై నేడు విచారణ
►టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తుల అటాచ్‌మెంట్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
►ఏడు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన సీఐడీ
►సీఐడీ వేసిన పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ

10:50 AM, Nov 8, 2023
నేడు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ
►తాజా రాజకీయ పరిణామాలపై యాక్షన్ కమిటీ చర్చ 
►రేపు విజయవాడలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం
►ఎజెండా ఖరారు చేయనున్న కమిటీ
►బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంపై చర్చ 
►ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాల పై చర్చ

10:00 AM, Nov 8, 2023
మీ క్రెడిబిలిటీ ఇదే పున్నమ్మా.. విజయసాయి సెటైర్లు
►ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరికి ఎంపీ విజయసాయి కౌంటర్‌
►2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే అక్కడి ప్రజలు 36 శాతం ఓట్లతో బొటాబొటిగా మిమ్మల్ని గెలిపిస్తే..
►కేంద్ర మంత్రి అయిన తమరు చేసింది ఏంటో తెలుసా? రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశావేమ్మా! 
►మళ్లీ 2019లో అదే విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లు కేవలం 2.73% అంటే 33,892 ఓట్లు.
►మొత్తం 12 లక్షల 50 వేల ఓట్లలో 33 వేల ఓట్లంటే కనీసం మన సామాజికవర్గం వాళ్ళు కూడా వేయనట్టే కదా!
►మీ క్రెడిబిలిటీ ఇదే పున్నమ్మా. 
►ఒకసారి మీకు గుర్తు చేయమని ఒక విశాఖ మిత్రుడు పంపాడు.

8:45 AM, Nov 8, 2023
పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు: మహిళలు ఫైర్‌
►చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి.. అనారోగ్యం సాకుతో బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి. 
►పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. 
►అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్‌ జగన్ మళ్లీ గెలుస్తారు. 
►ముఖ్యమంత్రి జగనే మళ్లీ సీఎం అవుతారు.  

పురంధేశ్వరి, బాలకృష్ణకి పోసాని కౌంటర్‌..

8:30 AM, Nov 8, 2023
పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్‌
►పురంధేశ్వరి స్వార్థంతో కూడిన అవకాశవాదం ఎలా ఉంటుందంటే ఒకసారి పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి మళ్లీ బరిలోకి దిగరు. 
►ప్రజల మనోభావాలను పట్టించుకోరు. 
►కాబట్టి రెండోసారి గెలిచే సీన్ లేదు. 
►కాంగ్రెస్ టికెట్ పై బాపట్ల, విశాఖపట్నంలో వైఎస్సార్ గారి హవాలో బయటపడ్డారు. 
►బీజేపీలో చేరాక రాజంపేట నుంచి పోటీ  చేసి లక్షా 75 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

7:45 AM, Nov 8, 2023
సుప్రీంకోర్టులో నేడు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు?
►స్కిల్‌ స్కాం కేసులో నేడు అత్యంత కీలక పరిణామం
►స్కిల్‌ స్కాంలో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడించే అవకాశం!
►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకో­ణం కేసు. 

ఇది కూడా చదవండి: స్కిల్‌ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం?!

7:30 AM, Nov 8, 2023
స్కిల్డ్‌ దొంగ చంద్రబాబే!: సీఐడీ
►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకో­ణం కేసు 
►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి 
►2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో బయటపడ్డ అక్రమం
►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం 
►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు­నాయుడే ప్రధా­న సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు 
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్‌ కూడా
►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు
►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ ఘరానా మోసం 
►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం
►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం 
►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
►ప్ర‌భుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారని సీఐడీ అభియోగం
►ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపు
►ఈ కుంభ‌కోణం 2016- 2018 మధ్య జ‌రిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు
►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు
►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
►కోర్టుల విచారణలో కీలక ఆధారాలను సమర్పించిన సీఐడీ

7:30 AM, Nov 8, 2023
ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది:  హరీష్‌ సాల్వే
►చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు
►ఈ కేసులో ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది
►రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది
►సెక్షన్‌ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది
►ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు
►రిమాండ్‌ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి
►విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది
►మొదట్లో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరులేదు. రిమాండ్‌ సమయంలో ఆయన పేరు చేర్చారు
►ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని సీఐడీ చెప్పింది కానీ, ఒక్కరికి కూడా 17ఏ నిబంధన కింద అనుమతి తీసుకోలేదు
►నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం
►న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి
►జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు
►ప్రభుత్వం తరఫున జరిగిన అవినీతిగా చూపుతున్నారు
►దేన్ని దేనితో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి
►2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారు
►ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది.
 

7:15 AM, Nov 8, 2023
17ఏ సెక్షన్‌ చంద్రబాబుకి వర్తించదు: లాయర్‌ రోహత్గి
►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో సీఐడీ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు
►అక్టోబర్‌ 17న బలమైన వాదనలు వినిపించిన రోహత్గి
►స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వేయడం తొందరపాటు చర్యేనని రోహత్గి వాదన
►17ఏ సెక్షన్‌ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది
►17ఏ సెక్షన్‌ చంద్రబాబుకి వర్తించదు
►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి
►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు
►స్కిల్‌ స్కామ్‌ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్‌ లేదు
►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది
►అవినీతి పరులకు ఈ సెక్షన్‌ రక్షణ కవచం కాకూడదు
►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్‌ తెచ్చారు
►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు
►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం
►అరెస్ట్‌ చేసిన ఐదు రోజులకే క్వాష్‌ పిటిషన్‌ వేయడం అత్యంత తొందరపాటు చర్య
►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు
►సెక్షన్‌​ 482 ప్రకారం క్వాష్‌ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం
►కేసు ట్రయల్‌ దశలో ఉన్నప్పుడు సెక్షన్‌ 482 ద్వారా క్వాష్‌ కోరడం సరికాదు
►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్‌ కొట్టేసినా సెక్షన్‌ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్‌ ట్రయల్‌ కోర్టు విచారణ కొనసాగించవచ్చు
►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే
►పీసీ యాక్ట్‌ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్‌లపై విచారించొచ్చు
►పీసీ యాక్ట్‌ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్‌ కోర్టుకు ఉంది
►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు
►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది
►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది

►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్‌ జడ్జికి కూడా ఉంటాయి
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం
►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్‌లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది
►ఎఫ్‌ఐఆర్‌లో కాగ్నిజబుల్‌ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం
►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి
►ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేశారు 
►స్కిల్‌ స్కామ్‌ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది
►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు
►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ సంస్థలు విచారణ చేస్తున్నాయి
►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది?
►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు
►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు
►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు
►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్‌ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు
►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు
►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు
►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది
►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి
►17ఏ అనేది ఈ కేసులో  వర్తించదు
► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది
►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది
►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు
►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది?
►స్కిల్‌ స్కామ్‌ కేసులో మరింత దర్యాప్తు అవసరం
►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది
►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది 
►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ ఇది
►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్‌ 44 PMLA పెట్టారు
►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది.
►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. 
►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. 
►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. 
►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి
►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి
►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు
►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? 
►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.  17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది
►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు
►కాని మరో జడ్జ్‌ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు
►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి
►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు

7:10 AM, Nov 08, 2023
బాబు ర్యాలీపై ఎన్‌హెచ్‌ఆర్సీలో కేసు నమోదు
►చంద్రబాబు హైదరాబాద్ ర్యాలీ పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(National Human Rights Commission of India-ఎన్‌హెచ్‌ఆర్సీ)లో కేసు నమోదు
►స్కిల్‌ స్కాం కేసులో కండిషన్‌ బెయిల్‌ మీద బయటకు వచ్చిన చంద్రబాబు 
►హైదరాబాద్‌ బేగంపేట నుండి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ చేపట్టిన బాబు
►బంజారాహిల్స్ రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పిర్యాదు
►అంబులెన్స్ కు సైతం సైడ్ ఇవ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని పిర్యాదు
►పోలీసులు చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని ఎన్‌హెచ్‌ఆర్సీకి పిర్యాదు
►ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు.. కేసు నమోదు

7:00 AM, Nov 08, 2023
అడకత్తెరలో పోకచెక్కలా మారిన పవన్‌
►ఏపీలో పవన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. 
►టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ ప్రకటించి దాదాపు రెండు నెలలు 
►కానీ బీజేపీ మాత్రం జనసేనతోనే మా పొత్తు అని చెప్తోంది. 
►మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ చేస్తోంది.. బీజేపీతో కలిసి జనసేన పోటీపడబోతోంది. 
►ఈ పిచ్చి పొత్తులు అర్థంకాక జనసైనికులు ఏ జెండాని మోయాలో తెలియక బిక్కచూపులు చూస్తున్నారు. 

6:40 AM, Nov 08, 2023
స్కిల్‌ స్కాం కేసు.. నేడు జడ్జిమెంట్‌ డే
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో కీలక పరిణామం
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు తీర్పు
►సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని తొలుత ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌
►సెప్టెంబర్‌  22వ తేదీన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు
►స్కిల్‌ స్కాంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్‌
►తనపై నమోదు అయిన కేసు కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌   
►ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ చుట్టూరానే తిరిగిన వాదనలు
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌-17ఏ పైనే వాడీవేడి వాదనలు
►చంద్రబాబు తరఫున హరీష్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా తదితరుల వాదనలు
►సీఐడీ(ఏపీ ప్రభుత్వం) తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ
►తీర్పు వెలువరించనున్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం.

6:35 AM, Nov 08, 2023
గురువారం ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ కేసు విచారణ
►గురువారం సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్  స్కామ్ కేసు విచారణ
►ఫైబర్‌నెట్‌ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు
►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధ­నం దోపిడీ 
►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు
►బాబు హయాంలో 2015 సెప్టెంబర్‌ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది 
►2021లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ 
►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ ద్వారా వీరు దోపిడీ
►బ్లాక్‌ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్‌
►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్‌ వీసీ అండ్‌ ఎండీ సుందర్‌ బదిలీ 
►టెండర్‌ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్‌ సొల్యూషన్స్‌ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు 
►ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల 
►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్‌ లైన్‌ అనే సంస్థకి చేరిక 
►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!! 
►అప్పటికప్పుడు సృష్టించిన షెల్‌ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు
►నెట్‌వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్‌ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ 
►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్‌ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక
►పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు
►ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్‌ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement