గుంటూరు: కూటమి సర్కారు వేధింపుల్లో భాగంగా అక్రమ అరెస్టుతో గుంటూరు జైల్లో ఉంటున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఇంటి భోజనం అనుమతించాల్సిందేనని గుంటూరు కోర్టు మరోసారి ఆదేశించింది. లేళ్ల అప్పిరెడ్డికి ఇంటి భోజనం అనుమతించాలని జూనియర్ సివిల్ జడ్జి ఆదేశించారు. మూడు రోజుల క్రితమే ఇంటి భోజనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించిన కోర్టు.. మరొకసారి అదే విషయాన్ని స్పష్టం చేసింది.
లేళ్ల అప్పిరెడ్డికి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేమని జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఆయనకు ఇంటి భోజనం అనుమతించాల్సిందేనని ఆధికారుల్ని ఆదేశించింది.
కాగా, స్థానిక ఎన్నికల వేళ ఇటీవల ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని పోలీసులు అక్రమ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బ్యాలెట్ బాక్సును మార్చేయడానికి యత్నించిన దుశ్చర్యపై పూర్తి విచారణ జరిపి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఉన్నతాధికారులు, ఎస్‌ఈసీ.. ఆ పనిచేయకపోగా ఆ తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరిపారు. శాంతియుతంగా ధర్నా చేసిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు పరిశీలకుడు గులాం రసూల్‌తోపాటు, మరో 17 మందిపై పలు సెక్షన్లతో అక్రమ కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ఏపీలో ప్రజాస్వామ్యమే అంతమైపోయిందా?


