‘రాప్తాడు’ బాలిక గోపిక కుటుంబానికి వైఎస్సార్‌సీపీ రూ.5 లక్షల చెక్కు | YSRCP hands over Rs 5 lakh cheque to Gopikas family | Sakshi
Sakshi News home page

‘రాప్తాడు’ బాలిక గోపిక కుటుంబానికి వైఎస్సార్‌సీపీ రూ.5 లక్షల చెక్కు

Nov 13 2026 7:32 PM | Updated on Nov 13 2026 7:45 PM

 YSRCP hands over Rs 5 lakh cheque to Gopikas family

అనంతపురం: రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపికకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును బెంగుళూరు మణిపాల్ ఆసుపత్రిలో గోపిక కుటుంబసభ్యులకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ అందించారు. వైఎస్ జగన్‌కు గోపిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గోపిక కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఇటీవలే వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  

మరోవైపు, రాప్తాడు దాడి ఘటనలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి గాయపడిన విద్యార్థిని లక్ష్మికి కూడా గురువారం వైఎస్‌ జగన్‌ 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఆర్థిక సాయం చెక్కును రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేసిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌కు లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రాప్తాడు ఘటనలో తన స్నేహితురాల్ని రక్షించడానికి ధైర్యసాహసాలు ప్రదర్శించిన విద్యార్థిని లక్ష్మిని ఇటీవల వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. లక్ష్మికి ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్‌.. స్నేహితురాలిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించిన ఆమె ధైర్యాన్ని అభినందించారు. లక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement