Nov 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

TDP Chandrababu Case Ppetitions Upadtes 13 November - Sakshi

నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగివెళ్లనున్న చంద్రబాబు

సమయం ముంచుకొస్తుండడంతో చంద్రబాబు, టిడిపిలో కలవరం

ఈలోగా కోర్టుల్లో ఊరట లభిస్తుందన్న ఆశలో చంద్రబాబు, టీడీపీ

TDP Chandrababu Cases Petitions..

6:00 PM,  Nov 13, 2023 
నవరత్నాలు కాపీ పేస్ట్‌.?
►మా మ్యానిఫెస్టోలో 11 అంశాలు : యనమల
►నవరత్నాల పేరుతో ఉన్న స్కీములన్నీ రద్దు చేశారు: యనమల
►అంటే మీ లక్ష్యం నవరత్నాలను రద్దు చేయడమేనా? : YSRCP
ప్రస్తుతం YSRCP ఇస్తోన్న నవరత్నాలు

1. రైతు భరోసా
2. ఆరోగ్యశ్రీ
3. అమ్మఒడి
4. పింఛన్ల పెంపు
5. పేదలందరికీ ఇళ్ళు
6. ఫీజు రీయింబర్స్ మెంట్
7. జలయజ్ఞం
8. మద్యపాన నిషేధం
9. ఆసరా, చేయూత

►ఇవే పథకాలను తిప్పి/మార్చి కొత్తగా ప్యాకింగ్‌ చేయాలన్న యోచనలో టిడిపి+జనసేన
►ఇన్నాళ్లు నవరత్నాలను తప్పుబట్టిన వాళ్లే ఇప్పుడు కాపీ కొట్టేందుకు సిద్ధమైన వైనం
►2014లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత టిడిపి+జనసేనదే

5:50 PM,  Nov 13, 2023 
ముగిసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటి
►ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయం
►విడివిడిగా హామీలు ఇవ్వొద్దని నిర్ణయం
►ఏదైనా మ్యానిఫెస్టోలోనే ఉండాలని నిర్ణయం
►ఉమ్మడి మేనిఫెస్టో కోసం కమిటీ ఏర్పాటు
►కమిటీలో ముగ్గురు చొప్పున రెండు పార్టీల సభ్యులు
►మినీ మేనిఫెస్టో రూపొందించిన తర్వాత కమిటీ ఆమోదానికి..!
►మినీ మేనిఫెస్టోలో ఉమ్మడిగా 11 అంశాలు
►ఏ విధంగా జనం ముందుకెళ్లాలి?
►ఏ విధంగా ఓటర్లను నమ్మించాలి?
►ఏ విధంగా ప్రజాకర్షక పథకాలను వల్లె వేయాలి?
►తాము పొత్తు ఎందుకు పెట్టుకున్నామో ఎలా వివరించాలి?
►తమ ఉమ్మడి ఎజెండా ఏంటో ప్రజలకు ఎలా చెప్పాలి?
►ఇన్నాళ్లు సంక్షేమాన్ని ఎందుకు వ్యతిరేకించామో చెప్పకుండా మ్యానిఫెస్టోను ముందుకు ఎలా తీసుకెళ్లాలి?

4:00 PM,  Nov 13, 2023 
తెలంగాణలో కాంగ్రెస్‌కు జైకొట్టిన తెలుగుదేశం తమ్ముళ్లు
►కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో మద్ధతు తెలుపుతోన్న తెలుగుదేశం
►చేతులు కలిపిన కాంగ్రెస్‌, టిడిపి
►అంతా ఓపెన్‌గానే జరుగుతున్న వ్యవహరాలు
►ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల
►తుమ్మలను ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన టీడీపీ
►టీడీపీ మద్దతును స్వాగతించిన తుమ్మల నాగేశ్వరరావు
►మరోవైపు టిడిపి మా తల్లిగారిల్లు అని ప్రకటించిన రేవంత్‌
►రేవంత్‌ గెలుపుకోసం శ్రమిస్తామని చెప్పిన టిడిపి నేతలు

3:00 PM,  Nov 13, 2023 
టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ
►టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం
►ఎన్టీఆర్ భవన్ లో భేటీ
►టీడీపీ-జనసేన నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున మేనిఫెస్టో కమిటీ
►టీడీపీ నుంచి యనమల, అశోక్ బాబు, పట్టాభి
►జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్
►ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన పై చర్చ
►టీడీపీ ప్రతిపాదించిన సూపర్ సిక్స్, జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం పై చర్చ
►ఉమ్మడి మ్యానిఫెస్టో పై రూపకల్పనపై ప్రాథమిక అవగాహన వచ్చేందుకు చర్చలు

2:22 PM,  Nov 13, 2023 
ఈ పుట్టింటి, అత్తారింటి సీక్రెట్ల సంగతేంటీ రేవంత్‌?
►రేవంత్ ప్రకటనపై YSRCP చురకలు
►తనకు TDP పుట్టినిల్లు, కాంగ్రెస్‌ అత్తారిల్లు అని ప్రకటించిన రేవంత్‌

2:13 PM,  Nov 13, 2023 
మ్యానిఫెస్టో సంగతి తర్వాత.? మీ లెక్కల సంగతి తేల్చండి : YSRCP
►ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు: ఎంపీ నందిగం సురేష్
►2 ఎకరాలతో రెండు లక్షల కోట్ల ఎలా సంపాదించారో సీక్రెట్ చెప్పమని చంద్రబాబును అడుగుతున్నా
►పేదలు ఇంగ్లీషు మీడియం చదివితే పోటీ వస్తారేమోనని కోర్టుకెళ్లారు
►అమ్మఒడి పథకాన్ని ఆపాలని కోర్టుకు వెళ్లారు
►తల్లి ఖాతాకు రూ.15 వేలు వేస్తే కేసు వేయించారు
►తన మనవడి ఖాతాలో మాత్రం చంద్రబాబు రూ.250 కోట్ల ఆస్తి వేశారు
►దోపిడి సొమ్ములో కుటుంబసభ్యులందరికీ వాటాలిచ్చారు
►బాబు దృతరాష్ట్రుడి కౌగిలి రాష్ట్రానికి అవసరం లేదు

2:02 PM,  Nov 13, 2023 
మ్యానిఫెస్టోపై ఇంత నాన్చుడు ఎందుకు?
►మ్యానిఫెస్టోపై కొలిక్కి రాలేకపోతోన్న తెలుగుదేశం, జనసేన
►అసలు ఏం ఉండాలన్నదానిపై కొరవడిన స్పష్టత
►YSRCP కంటే బాగుండాలన్నది మాత్రమే తాపత్రయం
►అంతే తప్ప మాట మీద నిలబడాలన్నదానిపై లేని గ్యారంటీ
►మ్యానిఫెస్టోలో మళ్లీ తెరమీదికి వచ్చిన సామాజిక వర్గాలు
►ఇరు పార్టీల్లో అప్పుడే ఒకరిపై మరొకరికి అనుమానం
►తెలుగుదేశం ఇచ్చే మ్యానిఫెస్టో పాయింట్లపై జనసేనకు డౌట్లు
►మేం చెప్పుకునేది ఏం లేదా? అంటూ ప్రశ్నిస్తోన్న జనసేన నాయకులు
►ఇంతకీ మ్యానిఫెస్టో ఇప్పుడు విడుదల చేయాలా? లేదా?
►నవంబర్‌ 28న చంద్రబాబు జైలుకు వెళ్తే పరిస్థితి ఏంటీ?
►సంక్షేమంపై ఇన్నాళ్లు మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెనక్కి తీసుకుంటారా?
►మేం వస్తే ఇదిస్తాం అని ఇప్పుడెలా చెబుతున్నారు?
►ఇదే సరైన పద్ధతి అయితే ఇన్నాళ్లు సంక్షేమాన్ని ఎందుకు తప్పుబట్టారు?
►పైగా ఎల్లోమీడియాలో శ్రీలంకలా మారిపోతోందని విషప్రచారం ఎందుకు చేశారు?
►ఇప్పటిదాకా చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని ఒప్పుకుంటారా?

1:20 PM,  Nov 13, 2023 
కాసేపట్లో టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ
►నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం
►ఎన్టీఆర్ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు మేనిఫెస్టో కమిటీ భేటీ
►టీడీపీ-జనసేన నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున మేనిఫెస్టో కమిటీ
►టీడీపీ నుంచి యనమల, అశోక్ బాబు, పట్టాభి
►జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్
►మేనిఫెస్టో కసరత్తుపై చర్చించనున్న కమిటీ

12:25 PM,  Nov 13, 2023 
చంద్రబాబు శిష్యులు మరి.!
►ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
►YSRCP కార్యకర్త బెనర్జీపై గత నెల 28న కత్తితో దాడి
►దాడి ఘటనలో ఇద్దరు తెలుగుదేశం నాయకులతో పాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి పాత్ర
►గత 17 రోజులుగా అజ్ఞాతవాసంలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి
►పార్టీ నేతలతో కలిసి ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ప్రవీణ్ అరెస్ట్

11:55 AM,  Nov 13, 2023 
నైపుణ్యం ఏది? ఎక్కడ? అంటూ పచ్చమీడియా వార్తలు
►నాలుగేళ్లలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 12 లక్షల 59 వేల మందికి శిక్షణ
►175 నియోజకవర్గాల్లో 192 స్కిల్ హబ్స్ లో శిక్షణ
►25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 26 స్కిల్ కాలేజీల ఏర్పాటు
►ప్రతినెల 52 జాబ్ మేళాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
►1,60,000 మందికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ ద్వారా శిక్షణ, సర్టిఫికెట్లు
►ఉపాధి కల్పనకు 50కి పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు
►తిరుపతిలో 50 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు
►పులివెందులలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పరిశ్రమల ప్రాంగణంలో స్కిల్ స్పోక్‌ ఏర్పాటు

11:15 AM,  Nov 13, 2023 
తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన, అసహనం
►చంద్రబాబు దేశంలో, అంతర్జాతీయంగా పేరున్న నాయకుడని నేను అనుకుంటున్నాను
►ఆయన్ను అరెస్ట్‌ చేస్తే టిడిపిలో దిక్కు, మొక్కు లేని పరిస్థితి వచ్చింది
►నాకు పార్టీతో సంబంధం లేదు, అయినా మాట్లాడుతున్నాను
►అలాంటిది పార్టీ వాళ్లు ఎందుకు నోరు విప్పడం లేదు?
►రాజమండ్రి జైలుకు వెళ్లి తెలుగుదేశం పార్టీని కాపాడతానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం నాకు సిగ్గు అనిపించింది
►ఆయనకు పార్టీలో ఏ పదవి లేదు, పక్క పార్టీ నుంచి వచ్చి చెప్పారు
►మనం కలిసి ఉంటామని, పొత్తు పెట్టుకుంటామని జైలు ముందు ప్రకటించారు
►40 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి ఇంకెవరు దిక్కు లేరా?
►ఇంకొకరి మద్ధతు లేకుండా.. సొంతంగా నిలబడలేదా?
►ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ తెలుగుదేశం
►గత కొన్నేళ్లుగా చంద్రబాబు నడిపిస్తున్నాడు
►చంద్రబాబు జైలుకు వెళ్లితే తెలుగుదేశం పార్టీని పట్టించుకునే నాథుడే లేడా?
►తెలుగుదేశం పార్టీలో ఇంకెవరూ లేరా?
►పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చాలా మంది పదవులు అనుభవించారు
►ఏమైపోయారు; ఎందుకు బయటకు రావడం లేదు? ఎందుకీ నిర్లిప్తత?

10:00 AM,  Nov 13, 2023 
టీడీపీ ‍శ్రేణుల్లో టెన్షన్‌..
►నవంబర్‌ 28న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తిరిగి వెళ్లనున్న చంద్రబాబు. 
►సమయం ముంచుకొస్తుండటంతో చంద్రబాబు, టీడీపీలో కలవరం. 
►ఈలోగా కోర్టుల్లో ఊరట లభిస్తుందన్న ఆశలో చంద్రబాబు, టీడీపీ
►అత్యాశకు పోయి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి కోర్టులను ఇరకాటంలో పెట్టిన టీడీపీ లీగల్‌ టీం. 
►ఇప్పుడు ఒకదానికి మరొకటి చిక్కుకుపోయి అసలుకే మోసం వచ్చే పరిస్థితి. 
►కేసులో బెయిల్‌ కోసం అడగకుండా క్వాష్‌ కోసం పట్టుబట్టడంతో సీన్‌ రివర్స్‌. 

8:45 AM,  Nov 13, 2023 
బాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే: యువకుడి అభిప్రాయం
►స్కిల్‌ స్కాం సూత్రధారి చంద్రబాబే. 
►అనారోగ్య కారణాలతోనే బాబుకు మధ్యంతర బెయిల్‌
►చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే.

8:30 AM, Nov 13, 2023 
ఇసుకపై పచ్చ విషం..
►ఇసుక తవ్వకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం.
►త‌ప్పుడు క‌థ‌నంతో విషం క‌క్కి ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించ‌డ‌మే ఎల్లో మీడియా లక్ష్యం. 
►ఇసుక‌కు టెండ‌ర్ పెట్టింది సీఎంవో అంటూ నిస్సిగ్గుగా త‌ప్పుడు క‌థ‌నం వండివార్చాడు రామోజీ.

8:00 AM, Nov 13, 2023 
చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?
కేసు : స్కిల్ స్కాం 
అంశం : మధ్యంతర బెయిల్‌
స్టేటస్‌ : అనారోగ్యం కారణంగా  మంజూరు
వివరణ : నవంబర్‌ 28న జైలు ముందు లొంగిపోవాలి

కేసు : స్కిల్ స్కాం 
అంశం : క్వాష్‌ పిటిషన్‌
స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్‌

కేసు : స్కిల్ స్కాం 
అంశం : రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 15కి వాయిదా పడ్డ కేసు

కేసు : ఇసుక కుంభకోణం
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 22కి తదుపరి విచారణ వాయిదా
 

కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ : నవంబర్‌ 30కి తదుపరి విచారణ వాయిదా

కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు

కేసు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 22కి వాయిదా పడ్డ కేసు
 

కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 21కి వాయిదా పడ్డ కేసు.

7:50 AM, Nov 13, 2023
రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు
ఒక వర్గం :  ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి
రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం

ఒక వర్గం :   కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి
రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.?

ఒక వర్గం :  ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు
రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top