చంద్రబాబు కేసు.. సీఐడీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ | Supreme Court Will Hearing On CID Petition In Chandrababu Case | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కేసు.. సీఐడీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

Nov 28 2023 9:05 AM | Updated on Nov 28 2023 10:35 AM

Supreme Court Will Hearing On CID Petition In Chandrababu Case - Sakshi

సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కాం కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన  పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈరోజు చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్‌ 64గా లిస్ట్‌ అయ్యింది. 

అయితే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ ఎస్‌ఎల్‌పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. 

ఏపీ సీఐడీ పిటిషన్‌లో కీలక అంశాలు..

  • చంద్రబాబుకు బెయిల్‌ విషయంలో పరిధి దాటింది.
  • సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
  • సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది
  • కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్‌ చిట్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది
  • ట్రయల్‌ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది
  • మినీ ట్రయల్‌ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం
  • దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి
  • అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు
  • చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. 
  • సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు
  • హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement