న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ దోపిడీ మరోసారి బట్టబయలైంది. అమరావతిలో కేంద్ర ప్రాజెక్టులతో చంద్రబాబు బండారం బయటపడింది. అమరావతిలో కేంద్ర సర్కారు సెంట్రల్ కాంప్లెక్స్‌ను నిర్మించనుంది. అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి చదరపు అడుగుకు 5,587 రూపాయలు మంజూరు చేసింది కేంద్రం.
ఉద్యోగ నివాసాలకు చదరపు అడుగుకు రూ.3,945 నిర‍్ధారించింది. మొత్తం 23.25 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం కోసం 1,299 కోట్ల రూపాయలు కేటాయించింది. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం మొత్తం 31.3 లక్షల చదరపు అడుగులకు 1,235 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. చదరపు అడుగుకు 5 వేల రూపాయలలోపే ఖర్చు చేయనుంది.
చంద్రబాబు సర్కార్ మాత్రం..
కేంద్ర సర్కారు అమరావతిలో ఇంత చవకగా బిల్డింగులు కడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం ఎందుకు చదరపు అడుగుకు 20 వేల ఖర్చు చేస్తుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపు అడుగుకు 20 వేల రూపాయలపైనే ఖర్చు చేస్తోంది. కేంద్రం కట్టే బిల్డింగుల ఖర్చు కంటే చంద్రబాబు సర్కార్ ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది.


