ఏపీ: శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 22 ఉద్యోగాలు

Srikakulam Recruitment 2021: Staff Nurse, Assistant Vancancies - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విజయవాడలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ).. శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సు–20, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌–2

స్టాఫ్‌ నర్సు: అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌)/ జీఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వేతనం: నెలకు  రూ.34,000 చెల్లిస్తారు.

ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు నర్సింగ్‌ హోం నుంచి రెండేళ్ల ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. వేతనం నెలకు  రూ.14,250 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం చిరునామాకు పంపించాలి.

►  దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021

వెబ్‌సైట్‌: https://srikakulam.ap.gov.in/notice_category/recruitment/

మరిన్ని నోటిఫికేషన్లు:
సదరన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ ఖాళీలు

బెల్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌  ఇంజనీర్‌ పోస్టులు

ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top