ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు

NFC Hyderabad Recruitment 2021: Apply Online For ITI Apprentices Vacancies - Sakshi

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► ట్రేడులు: అటెండెంట్, ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, కోపా, స్టెనోగ్రాఫర్, మెకానిక్‌ డీజిల్, ప్లంబర్, వెల్డర్‌.

 అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 2018, 2019, 2020లో విద్యార్హత పూర్తి చేసుకున్న వారు మాత్రమే అర్హులు.

► వేతనం: వివిధ ట్రేడుల ఆధారంగా నెలకు రూ.8,050, నెలకు రూ.7,700 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021
► వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org

మరిన్ని నోటిఫికేషన్లు:
వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు

డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 5807 టీజీటీ పోస్టులు

డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో 10 జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top