బెల్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌  ఇంజనీర్‌ పోస్టులు

BHEL Bangalore Recruitment 2021: Job Vacancies, Eligibility, Salary, Selection Process - Sakshi

బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 09
► పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్‌–06, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–03.

ట్రెయినీ ఇంజనీర్‌: అర్హత: ఏరోస్పేస్‌/ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 01.05.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. జీతం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: అర్హత: ఏరోస్పేస్‌/ఏరోనాటికిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.ఎంఈ/ ఎంటెక్‌ అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు. వయసు: 01.05.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. జీతం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిగ్రీ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌(హెచ్‌ఆర్‌/ఎస్‌సీ–యూఎస్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహల్లీ, బెంగళూరు–560013 చిరునామాకు పంపించాలి.

► దర ఖాస్తులకు చివరి తేది: 09.06.2021
► వెబ్‌సైట్‌: https://www.bel-india.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు

వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top