సదరన్‌ రైల్వేలో 3378 అప్రెంటిస్‌ ఖాళీలు 

Southern Railway Apprentice 2021 Notification: Apply Online, Eligibility, Selection Process - Sakshi

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్‌ రైల్వే, పెరంబూరులోని క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ వర్క్స్‌కు చెందిన చీఫ్‌ వర్క్‌షాప్‌ మేనేజర్‌ కార్యాలయం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► అప్రెంటిస్‌ మొత్తం ఖాళీల సంఖ్య: 3378

పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్‌ వర్క్‌షాప్, లోకోవర్క్స్, ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్, చెన్నై డివిజన్‌. 

విభాగాలు: ఫ్రెషర్‌ కేటగిరీ, ఎక్స్‌ ఐటీఐ, ఎంఎల్‌టీ.

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ తదితరాలు. 

అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియెట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌/బయాలజీ)ఉత్తీర్ణత ఉండాలి. 

వయసు: 15 ఏళ్లు నిండి ఉండాలి. 22/24 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్‌ మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

వెబ్‌సైట్‌: https://sr.indianrailways.gov.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు

వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు

బెల్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌  ఇంజనీర్‌ పోస్టులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top