breaking news
	
		
	
  Apprentice posts
- 
      
                   
                                 డీఆర్డీవో, ఐటీఆర్ చాందీపూర్‌లో అప్రెంటిస్ ఖాళీలుభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్డీవో–ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరాఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 116 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–50, డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు–40, ట్రేడ్ అప్రెంటిస్‌లు–26. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీబీఏ, బీకాం, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,సివిల్,సినిమాటోగ్రఫీ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► ట్రేడ్ అప్రెంటిస్‌లు: ట్రేడులు: కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► 2019, 2020, 2021లో అర్హత కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.drdo.gov.in
- 
      
                   
                                 భారీ సంఖ్యలో అప్రెంటిస్ జాబ్స్.. రైల్వే నోటిఫికేషన్ఐటీఐ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్. వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2226 అప్రెంటిస్‌లు జబల్పూర్ పధాన కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్ రైల్వే, రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. 2021–22 సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 2226 ► ట్రేడులు: డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్ తదితరాలు. ► అర్హత: 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.01.2022 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించి న మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► వెబ్సైట్: https://wcr.indianrailways.gov.in ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు పాట్నా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఈసీఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. వివిధ డివిజన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం ఖాళీల సంఖ్య: 2206 ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, వైర్‌మెన్ తదితరాలు. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.01.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.11.2021 ► వెబ్సైట్: https://ecr.indianrailways.gov.in సౌత్ వెస్టర్న్ రైల్వే, హుబ్లిలో 904 అప్రెంటిస్‌లు హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 904 ► డివిజన్ల వారీగా ఖాళీలు: హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్‌షాప్–217, బెంగళూరు డివిజన్–230, మైసూరు డివిజన్–177, సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు–43. ► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 03.11.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021 ► వెబ్సైట్: www.rrchubli.in
- 
      
                   
                                 దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలుసికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4103 ► అప్రెంటిస్ వివరాలు: ఏసీ మెకానిక్– 250, కార్పెంటర్–18, డీజిల్ మెకానిక్–531, ఎలక్ట్రీషియన్–1019, ఎలక్ట్రానిక్ మెకానిక్–92, ఫిట్టర్–1460, మెషినిస్ట్–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్–80, వెల్డర్–553. ► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ► వయసు: 04.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021 ► వెబ్సైట్: https://scr.indianrailways.gov.in ఐసీఎఫ్, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం ఖాళీల సంఖ్య: 794 ► ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్,వెల్డర్, ఎంఎల్టీ, పాసా. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్సీవీటీ/ఎస్వీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ► వయసు: 26.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.10.2021 ► వెబ్సైట్: https://icf.indianrailways.gov.in/
- 
      
                   
                                 బెంగళూరు రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్లుబెంగళూరులోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ.. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 192 ► ఖాళీల వివరాలు: ఫిట్టర్–85, మెషినిస్ట్–31, మెకానిక్–08, టర్నర్–05, సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్(సీఓఈ గ్రూప్)–23, ఎలక్ట్రీషియన్–18, ఎలక్ట్రానిక్ మెకానిక్–22. ► అర్హత: కనీసం 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ► వయసు: 13.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. ► స్టయిపెండ్: నెలకు రూ.12,261 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు–560064 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: rwf.indianrailways.gov.in
- 
      
                   
                                 సదరన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలుచెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే, పెరంబూరులోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్‌కు చెందిన చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ కార్యాలయం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 3378 ► పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్ వర్క్‌షాప్, లోకోవర్క్స్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, చెన్నై డివిజన్. ► విభాగాలు: ఫ్రెషర్ కేటగిరీ, ఎక్స్ ఐటీఐ, ఎంఎల్టీ. ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ)ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: 15 ఏళ్లు నిండి ఉండాలి. 22/24 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021 ► వెబ్సైట్: https://sr.indianrailways.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఎన్ఎఫ్సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
- 
      
                   
                                 రైల్వేలో భారీగా ఉద్యోగావకాశాలుపశ్చిమ మధ్య రైల్వే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియలో మొత్తం 5718 ఖాళీలు పూరించనుంది. అప్రెంటీస్ చట్టం1961 ప్రకారం ఏడాదికాలం శిక్షణకోసం వీరిని ఎంపిక చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 2019 జనవరి 9వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్పి ఉంటుంది. https://www.rrc-wr.com/ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ నెం.ఆర్ఆర్సి / డబ్ల్యుఆర్ / 04/2018 (ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్)క్లిక్ చేసి, సంబంధిత డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి లేదా ఇంటర్ పాసై వుండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది వుండాలి. వయసు: 15-24సంవత్సరాల వయస్సు. ఆయా కేటగిరీల వారీగా వయసులో మినహాయింపు ఎంపిక: పదవ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఫీజు : 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనవరి 15న మెరిట్ లిస్ట్ ప్రకటించే అవకాశం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 21 జనవరి నుంచి ప్రారంభం. 2019 ఏప్రిల్ 1తేదీనుంచి ట్రైనింగ్ మొదలు
- 
      
                   
                                 సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు
 సెంట్రల్ రైల్వే.. వివిధ వర్క్‌షాప్స్, యూనిట్ల పరిధిలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 ముంబై క్లస్టర్
 
 (క్యారేజ్ అండ్ వ్యాగన్
 (కోచింగ్) వాడి బందర్, ముంబై
 ఫిట్టర్ = 182
 వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6
 కార్పెంటర్ = 28
 పెయింటర్ (జనరల్) = 24
 టైలర్ (జనరల్) = 18
 
 కల్యాణ్ డీజిల్ షెడ్
 1. ఎలక్ట్రీషియన్ = 11
 2. మెషినిస్ట్ = 1
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 1
 4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ = 4
 5. మెకానికల్ డీజిల్ = 33
 6. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ) = 3
 
 కుర్లా డీజిల్ షెడ్
 1. ఎలక్ట్రీషియన్ = 24
 2. మెకానికల్ డీజిల్ = 36
 
 ఎస్ఆర్.డీఈఈ (టీఆర్ఎస్) కల్యాణ్
 1. ఫిట్టర్ = 62
 2. టర్నర్ = 10
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 10
 4. ఎలక్ట్రీషియన్ = 62
 5. మెషినిస్ట్ = 5
 6. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ = 5
 7. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ) = 5
 8. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ = 20
 
 ముంబై క్లస్టర్
 
 ఎస్ఆర్ (డీఈఈ) (టీఆర్ఎస్) కుర్లా
 1. ఫిట్టర్ = 90
 2. టర్నర్ = 6
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3
 4. ఎలక్ట్రీషియన్ = 93
 
 పారెల్ వర్క్‌షాప్
 1. ఫిట్టర్ = 6
 2. మెషినిస్ట్ = 9
 3. షీట్ మెటల్ వర్కర్ = 9
 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6
 
 5. ఎలక్ట్రీషియన్ = 11
 6. విండర్ (ఆర్మేచర్) = 5
 7. మెకానిక్
 మెషిన్ టూల్స్ = 24
 8. టూల్ అండ్ డై మేకర్ = 68
 9.మెకానిక్ (మోటార్ వెహికల్) = 4
 10. మెకానిక్ డీజిల్ = 74
 
 మాతుంగ వర్క్‌షాప్
 1. మెషినిస్ట్ = 26
 2. మెకానిక్ మెషిన్టూల్ మెయింటెనెన్స్= 48
 3. ఫిట్టర్ = 197
 4. కార్పెంటర్ = 126
 5. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 55
 6. పెయింటర్ = 37
 7. ఎలక్ట్రీషియన్ = 90
 
 ముంబై క్లస్టర్
 
 ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా
 1. ఫిట్టర్ = 25
 2. టర్నర్ = 6
 3. మెషినిస్ట్ = 5
 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8
 5. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్
 అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ = 6
 6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్
 ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ = 2
 7. ఎలక్ట్రీషియన్ = 3
 8. పెయింటర్ (జనరల్) = 4
 
 భుసావల్ క్లస్టర్
 
 గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్
 1. ఫిట్టర్ = 107
 2. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 12
 3. మెషినిస్ట్ = 3
 
 ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్
 1. ఫిట్టర్ = 38
 2. ఎలక్ట్రీషియన్ = 38
 3. వెల్టర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 4
 
 ఎలక్ట్రిక్ లోకోమోటి వ్ వర్క్‌షాప్,
 భుసావల్
 1. ఎలక్ట్రీషియన్ = 56
 2. ఫిట్టర్ = 53
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7
 4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్
 అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ = 2
 
 భుసావల్ క్లస్టర్
 
 
 మన్మాడ్ వర్క్‌షాప్
 1. ఫిట్టర్ = 27
 2. టర్నర్ = 3
 3. మెషినిస్ట్ = 7
 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7
 5. మెకానిక్ (మెటార్ వెహికల్) = 1
 6. మెకానిక్ డీజిల్ = 4
 7. పెయింటర్ (జనరల్) = 2
 
 టీఎండబ్ల్యు నాసిక్ రోడ్
 1. ఫిట్టర్ = 10
 2. మెషినిస్ట్ = 4
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6
 4. ఎలక్ట్రీషియన్ = 26
 5. కార్పెంటర్ = 2
 6. మెకానిక్ డీజిల్ = 2
 
 పుణె క్లస్టర్
 
 
 గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్
 1. ఫిట్టర్ = 20
 2. మెషినిస్ట్ = 3
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3
 4. పెయింటర్ (జనరల్) = 2
 డీజిల్ లోకోషెడ్
 1. మెకానిక్ డీజిల్ = 9
 2. ఎలక్ట్రీషియన్ = 30
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8
 4. మెషినిస్ట్ = 2
 5. పెయింటర్ (జనరల్) = 1
 
 నాగపూర్ క్లస్టర్
 
 ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని
 
 1. ఎలక్ట్రీషియన్ = 33
 2. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ = 15
 
 గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో
 1. ఫిట్టర్ = 51
 2. పెయింటర్ (జనరల్) = 1
 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 5
 4. కార్పెంటర్ = 2
 
 షోలాపూర్ క్లస్టర్
 
 గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్
 1. ఫిట్టర్ = 72
 2. కార్పెంటర్ = 7
 3. మెషినిస్ట్ = 8
 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 11
 5. పెయింటర్ (జనరల్) =3
 6. మెకానిక్ డీజిల్ = 2
 
 కుర్దువాడీ వర్క్‌షాప్
 1. ఫిట్టర్ = 7
 2. మెషినిస్ట్ = 5
 3. వెల్డర్
 (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 4
 4. కార్పెంటర్ = 2
 5. పెయింటర్ (జనరల్) = 3
 
 అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి (10+2 విధానంలో) ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
 వయోపరిమితి: నవంబర్ 1, 2016 నాటికి 15 ఏళ్లు నిండి 24 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
 ఎంపిక: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి వైద్య పరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
 దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ఐటీఐ ట్రేడ్ ఆధారంగా ఏదో ఒక క్లస్టర్‌కు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రింటవుట్ దరఖాస్తు పంపాల్సిన అవసరం లేదు.
 దరఖాస్తు రుసుం: డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ఎస్బీఐ చలాన్ ద్వారా రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగులకు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం:
 నవంబర్ 1, 2016
 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
 నవంబర్ 30, 2016
 వెబ్సైట్: https://www.rrccr.com/
- 
      
                    ఇంటర్వ్యూ తేదీలు
 * సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులకు: జూన్ 15
 * హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ లో కన్సల్టెంట్ పోస్టులకు: జూన్ 21
 * ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)లో ప్రాజెక్ట్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు: జూన్ 24


