రైల్వేలో భారీగా ఉద్యోగావకాశాలు

Western Railway Recruitment 2018 - Sakshi

పశ్చిమ మధ్య రైల్వే మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

5వేలకు పైగా అప్రెంటిస్‌ ఉద్యోగాలు

పశ్చిమ మధ్య రైల్వే మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ చేపట్టింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌  ఉద్యోగాల కోసం  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  ఈ  ప్రక్రియలో మొత్తం 5718 ఖాళీలు పూరించనుంది. అప్రెంటీస్ చట్టం1961 ప్రకారం  ఏడాదికాలం శిక్షణకోసం వీరిని ఎంపిక చేయనుంది.

ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 2019 జనవరి 9వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్పి ఉంటుంది. https://www.rrc-wr.com/ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి  ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్ నెం.ఆర్ఆర్‌సి / డబ్ల్యుఆర్ / 04/2018 (ఎంగేజ్‌మెంట్‌ ఆఫ్‌ అప్రెంటిస్)క్లిక్‌ చేసి, సంబంధిత డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్‌ చేసి  దరఖాస్తు  ప్రక్రియను పూర్తి చేయాలి.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి లేదా ఇంటర్‌ పాసై వుండాలి.  అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌  పొంది వుండాలి.
వయసు: 15-24సంవత్సరాల వయస్సు.  ఆయా కేటగిరీల వారీగా వయసులో మినహాయింపు
ఎంపి​క:  పదవ తరగతి, ఐటీఐ మార్కుల  ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌
ఫీజు : 100 రూపాయలు. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనవరి 15న మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించే అవకాశం. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌  21 జనవరి నుంచి ప్రారంభం.  2019 ఏప్రిల్‌ 1తేదీనుంచి ట్రైనింగ్‌ మొదలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top