సాక్షి, తాడేపల్లి: తన తండ్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని.. ప్రజల అందరి ఆశీస్సులతో తన తండ్రి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ముద్రగడ గిరి అన్నారు. తన తండ్రి అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ప్రతిరోజూ ముద్రగడ ఆరోగ్యంపై వివరాలుఅడిగి తెలుసుకుంటున్నారన్నారు.
‘‘డాక్టర్లతోనూ వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. స్పెషల్ కేర్ తీసుకోవాలని డాక్టర్లతో చెప్పారు’’ అని గిరి తెలిపారు. నాన్నకు వైఎస్ జగన్ చేసిన సాయం మరిచిపోలేమని.. మేం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని గిరి తెలిపారు.


