రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్‌ | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్‌

Aug 19 2026 1:53 AM | Updated on Aug 19 2026 1:53 AM

● అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్‌ నుంచి మంగళగిరి వెళ్లే రహదారిలో హోసన్నా ప్రార్థన మందిరం వద్ద ఓ కళ్యాణమండపం నిర్వహిస్తున్నారు. దాని తాళాన్ని స్థానికంగా ఉన్న యువకులకు ఇవ్వడంతో రాత్రిళ్లు ఆ కళ్యాణ మండపంలో మద్యం, గంజాయి సేవిస్తూ పెద్దపెద్దగా కేకలు వేస్తూ బూతులు తిట్టుకుంటుంటారని స్థానికులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి 20 మంది యువకులు రోడ్డుపైకి చేరి ఘర్షణ పడుతూ ఆ రోడ్డులో గందరగోళం సృష్టించారు. ఈ రెండు ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు కాయకష్టం చేసుకుని ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఆరుబయట పడుకుంటారు. ప్రతిరోజూ ఇలాంటి గంజాయి, మద్యం బ్యాచ్‌లు గొడవలు చేయడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● మరొక ఘటనలో పాత జాతీయ రహదారి నుంచి తాడేపల్లికి వెళ్లే మార్గంలో రోడ్డుపక్కనే పార్కింగ్‌ చేసిన లారీని గంజాయి మత్తులో ఓ యువకుడు ఢీ కొట్టాడు. ఆటో ఆపకుండా పరారు కావడంతో స్థానికులు ఆటోను వెంబడించి ఆర్‌ఎంఎస్‌ కాలనీ వద్ద ఆటో ఆపారు. ఆటో నడుపుతున్న యువకుడ్ని ప్రశ్నించారు. గంజాయి తాగావు పోలీస్‌స్టేషన్‌కు పద అని అడగడంతో ప్రశ్నిస్తున్న వారిని నెట్టివేసి రైల్వే డంపింగ్‌యార్డులోకి పరుగులు తీశాడు. నిత్యం వీవీఐపీలు నివసిస్తున్న ఇలాంటి ప్రాంతాల్లో అల్లరి మూకలను, గంజాయి, మద్యం బ్యాచ్‌ను నియంత్రించడంలో పోలీసులు విఫలమైనట్లు కనిపిస్తోంది. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో 150 మంది సిబ్బంది ఉండగా పట్టుమని 50 మంది కూడా లేకపోవడం వల్లే నిఘా ఏర్పాటు చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికై నా పోలీస్‌ ఉన్నతాధికారులు మేల్కొని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందిని పెంచి భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఒకరిపై ఒకరు మూక దాడులు ఒకే రోజు మూడు ప్రాంతాల్లో ఘటనలు రాత్రిళ్లు కనిపించని పోలీసుల గస్తీ

తాడేపల్లి రూరల్‌: వీవీఐపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసిస్తున్న తాడేపల్లి పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు గంజాయి, మద్యం మత్తులో తిరుగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ముఖ్య రహదారులైన ఎన్‌టీఆర్‌ కరకట్ట, కేఎల్‌రావు కాలనీ ప్రాంతాల్లో 10 నుంచి 15 మంది యువకులు మూక దాడి చేసుకున్నారు. ఎన్‌టీఆర్‌ కరకట్ట వినాయకుడి గుడివద్ద జరిగిన ఘర్షణలో వాహనాలకు అడ్డంగా వెళ్లి కార్లు ఆపి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం విశేషం. ఇంత జరుగుతున్నా అక్కడకు పోలీసులు మాత్రం ఎవరూ రాకపోవడం గమనార్హం.

సీఎం నివాసానికి సమీపంలో

జోరుగా పేకాట

తాడేపల్లి రూరల్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి అతి సమీపంలో ఉండవల్లికి చెందిన ఓ యువకుడు పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాడు. గుంటూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ పేకాట స్థావరంపై మంగళవారం దాడిచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ సీఐ–2 మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ఎస్బీ డీఎస్పీ ఆదేశాల మేరకు ఉండవల్లిలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది తోకలసి దాడి చేశామని, ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను, ఆరు ద్విచక్రవాహనాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ. 24500 లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ పేకాట స్థావరాన్ని ఉండవల్లికి చెందిన పవన్‌కుమార్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పేకాట నిర్వహిస్తున్న పవన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. స్టేషన్‌ బెయిల్‌ తీసుకున్న రెండు రోజుల్లోనే పవన్‌ మళ్లీ పేకాట నిర్వహించడం విశేషం. ఒకసారి పేకాటలో దొరికిన వారిపై పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నారని స్ధానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement