రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

Published Fri, Sep 8 2023 4:51 AM

Revolutionary changes in the registration system - Sakshi

సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం జగన్‌ ఆదేశాలతో అధికా­రులు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష­న్‌ వ్యవస్థలో సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తె­చ్చారు. ఆన్‌లైన్‌లో స్టాంప్స్‌ అండ్‌ రిజి­స్ట్రేషన్‌ సేవలను విస్తృతంగా అందించను­న్నా­రు.

అత్యా­ధు­నిక కార్డ్‌ ప్రైం సాఫ్ట్‌వేర్, ఈ–­స్టాంపింగ్,  గ్రామ­­/­­వార్డు సచివాలయాల్లో రిజి­స్ట్రే­షన్‌ సేవల­తో మరింత సులభతరమైన రిజి­స్ట్రేషన్‌ వ్యవ­స్థను అందుబాటులోకి తెచ్చి 23 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దీని­ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. త్వర­లో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సేవలు అందుబా­టులోకి తేనున్నారు.

కార్డ్‌ ప్రైం ద్వారా సులభతరమైన రిజిస్ట్రేషన్‌
రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు ఇకపై ఆన్‌లైన్‌లో సమ­ర్పించే వెసులుబాటు కల్పించారు. కార్డ్‌ ప్రైం అప్లికేషన్‌ ద్వారా వినియోగదారులు దస్తావే­జుల­ను వారే స్వయంగా రూపొందించుకోవచ్చు. రిజి­స్ట్రేషన్‌ ఛార్జీలు సైతం సొంతంగా కాలి­క్యులే­ట్‌ చేసుకుని ఆన్‌లైన్‌లోనే చెల్లించే సదుపాయం కల్పించారు. అనుకూలమైన సమయాల్లో రిజి­స్ట్రేషన్‌ టైం స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆ సమ­యానికి వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

ఈ–సైన్‌ సౌకర్యంతో డాక్యుమెంట్స్‌కు మరింత భద్రత ఉంటుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. వ్యవసాయ భూము­లకు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లోనూ పేరు మార్పు జరుగుతుంది. ఆధునిక సాంకేతికత ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లను నిర్మూలించవచ్చు. 

ఈ–స్టాంపింగ్‌తో వేగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
ఈ–స్టాంపింగ్‌తో రిజిస్ట్రేషన్‌  ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. స్టాంప్‌ డ్యూటీ, ఇతర ఛార్జీ­లు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు. ఈ స్టాంపింగ్‌తో స్టాంపుల కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడినట్లు అవుతుంది. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌హెచ్‌సీఎల్‌) బ్రాంచ్‌లు, స్టాంపు వెండార్లు, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల (సీఎస్‌సీ)లో ఈ స్టాంపింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల ద్వారా ఈ– స్టాంపులను విక్రయిస్తారు.

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు..
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సైతం పూర్తిస్థాయిలో రిజిస్ట్రేష­న్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతగా 1,680 సచివాలయాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. అనంతరం మిగిలిన సచివాలయాల్లో కూడా సేవలను విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్‌ సౌకర్యాలు వస్తాయి. స్టాంప్‌ విక్రయ సేవలు, ఈసీ (ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌), సీసీ, హిందూ మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్, మార్కెట్‌ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లూ మొదలవుతున్నాయి.

ఐరిస్‌తో వేలిముద్రల సమస్యకు పరిష్కారం
ఈ సిగ్నేచర్‌ కోసం వేలిముద్రలు పడటంలేదనే ఫిర్యాదులు రావడంతో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. ఈ సమస్య పరిష్కారానికి ఐరిస్‌ యంత్రాలు కొనుగోలు చేసింది. అవసరమైతే మరికొన్ని కొనేలా ఆదేశాలు ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో వేలిముద్రలు పడకపోయినా ఐరిస్‌ (కళ్లు) ద్వారా ఆ పక్రియను పూర్తి చేయవచ్చు.

అపోహలు వద్దు – దుష్ప్రచారాలను నమ్మొద్దు
రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ ద్వారా జనరేటయ్యే రిజిస్ట్రేషన్‌ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాల జీ యాక్ట్‌ – 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భ ద్రత ఉంటుంది. డిజిటల్‌ రిజిస్టర్డ్‌ డా క్యుమెంట్‌ అందుబాటులోకి వస్తుంది. ఫిజి కల్‌ డాక్యు మెంట్‌తో సమానంగా డిజిటల్‌ రిజిస్టర్‌ డా­క్యు­­మెంట్‌కు గుర్తింపు ఉంటుంది. ఈ– సైన్‌ ద్వారా మరింత భద్రత ఉంటుంది. ఆన్‌లైన్‌­లోనే డాక్యుమెంట్‌ ఒరి­జినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్‌ పెట్టవచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే వెరిఫై చేసుకునే సదు­పాయం ఉంది.

నూతన విధా­నంలో∙భద్రతా ప్రమా­ణా­లతో రిజిస్ట్రే­ష­న్‌ డాక్యుమెంట్‌ రూ­పొం­దు­తుంది. ఈ విధానంలో సాక్షులు లేకుండా రిజి­స్ట్రేషన్లు అనేది పూర్తి ‘అవాస్తవం’. ఈ ఆధార్‌ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ అనేది ‘వాస్తవం’. నూతన విధా­నంలో ఫిజి­కల్‌ డా­క్యుమెంట్‌ ఇవ్వరనేది అవాస్తవం. ఫిజి­కల్‌ డా­క్యుమెంట్‌ కావాలన్న­వారికి ఈ స్టాంప్‌పై డిజి­టల్‌ సిగ్నేచర్‌ ప్రింట్‌ చేసి ఇస్తారు. సూచనలు, ఫిర్యాదులకు ‘జగనన్నకు చెబు­దాం 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌’ను వినియోగించుకోవచ్చు.

Advertisement
 
Advertisement